Monday, February 20, 2012

about-srikanth's-devaraya-film


శ్రీకాంత్ 'దేవరాయ'అస్సలు మ్యాటరేంటి?


శ్రీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'దేవరాయ'. దొరబాబుగా, శ్రీకృష్ణ దేవరాయులుగా శ్రీకాంత్ కనిపించే చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఈ చిత్రాన్ని నానికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''గతం తెలుసుకొన్న మనిషి కథ ఇది. అమలాపురంలో దొరబాబు పేరు చెబితే చాలు... పేకాట రాయుళ్లు పండగ చేసుకొంటారు. ఎందుకంటే మనోడికి ఎప్పుడూ ముక్క తిరిగిందే లేదు. అందుకే దొరబాబుతో ఆడాలి, వాడి జేబులోని డబ్బులన్నీ మన చేతికి అందేయాలి.. అని కాపు కాస్తారు. అదొక్కటే కాదు.. దొరబాబుకు చాలా సరదాలే ఉన్నాయి. ఆ అలవాట్లతో ఇల్లూ వాకిలీ గుల్ల చేసుకొన్నాడు. ఆ తరవాత ఏమైంది? అసలు దొరబాబుకీ రాయలవారి వంశానికీ సంబంధం ఏమిటి? జల్సారాయుడిగా పేరుతెచ్చుకొన్న దొరబాబు గతమేంటి? అనేదే కథలో కీలకం. ఈ విషయాలు తెలియాలంటే 'దేవరాయ' సినిమా చూడాల్సిందే.

రెండు పాత్రల్లో శ్రీకాంత్‌ నటన ఆకట్టుకొంటుంది. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్‌లో మలి దశ చిత్రీకరణ మొదలుపెడతాం. బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు. విదిశ, మీనాక్షిదీక్షిత్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి నానికృష్ణ, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మాతలు.

No comments:

Post a Comment