Thursday, February 23, 2012

mahesh-babu-uses-beauty-secret


మహేష్ బాబు గ్లామర్ రహస్యం ఇదే...


సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. 40 సంవత్సరాల వయసుకు చేరువవుతున్నా...ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా నవనవలాడుతుంటారు. మహేష్ బాబు గ్లామర్‌కి ఎంతటి అందగత్తెలాంటి హీరోయిన్ అయినా దిగదుడుపే అని స్వయంగా పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. ఆయన గ్లామర్ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి చాలా మంది చాలా సార్లు ప్రత్నించారు కానీ వీలు కాలేదు. ఆయన గ్లామర్ కోసం స్కిన్ తెరపీ చేయించుకున్నారని, ప్రత్యేకంగా మందులు వాడుతారనే ప్రచారం కూడా ఉంది.

తాజాగా తన గ్లామర్ రహస్యం ఏమిటో స్వయంగా వెల్లడించాడు మహేష్ బాబు. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...ఇందులో దాచాల్సింది ఏమీ లేదని, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటే గ్లామర్ దానంతట అదే వస్తుందని చెప్పకొచ్చారు. వీలనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఇలా చేస్తే ఎవరైనా సరే ఆరోగ్యంగా, అందంగా ఉంటా మహేష్ బాబు చెప్పారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. దిల్ రాజు నిర్మాత.

nitin-about-his-film-ishq


నా ఆరోగ్యం సహకరించకపోయినా...నితిన్


అప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. అయినా... పట్టుబట్టి నాతో పాడించాడు. ఈ పాటకు లభించిన స్పందన చూశాక ఎంతో ఆనందం కలిగింది అంటున్నారు నితిన్. ఆయన తన తాజా చిత్రం ఇష్క్‌ లో ఓ పాట పాడారు. ఆ పాట గురించి మీడియా వారు అడిగితే ఇలా స్పందించారు. అలాగే...పాడటం నాకు అస్సలు రాదు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ బలవంతం చేయడంతో లచ్చువమ్మ... పాట పాడాను. కృష్ణచైతన్య ఆ పాట రాస్తున్నప్పుడు నేను కూడా పక్కనున్నాను. సరదాగా పాటని హమ్‌ చేస్తూ తిరుగుతున్నాను. అక్కడే ఉన్న అనూప్‌ రూబెన్స్‌ 'నువ్వు పాడుతుంటే బాగుంది. ప్రయత్నించొచ్చు కదా?' అన్నాడు.

ఇక వరస ప్లాప్ ల గురించి మాట్లాడుతూ...సినిమా జయాపజయాల వెనుక రకరకాల కారణాలుంటాయి. కానీ నేను పడే కష్టం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మంచి కథల్నే ఎంచుకొంటున్నాను. కానీ అవి చివరికి సరైన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. 'ఇష్క్‌' కోసం మరింత కసితో పనిచేశాను. ఈ సినిమా తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నా అన్నారు. ఇక హీరోలంతా స్పీడు పెంచారు. వరుసగా సినిమాలు చేయడం అందరికీ మంచిదే. ఇదివరకు నేనూ అలాగే చేశాను. కొన్ని రోజులుగా నా కెరీర్‌లో వేగం తగ్గిందంతే. మంచి కథలు దొరికితే నేనూ వరుసగా సినిమాలు చెయ్యాలనుకొంటున్నా అని చెప్పుకొచ్చారు. నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఇష్క్‌'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tuesday, February 21, 2012

Amala-paul-with-ram-charan


రామ్ చరణ్ సరసన...నాగచైతన్య హీరోయిన్

 

నాగచైతన్య సరసన బెజవాడ చిత్రంలో నటించిన అమలాపౌల్ కి తెలుగులో మరో ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వినాయిక్ ఆమె చిత్రాలు చూసి ఇంప్రెస్ అయ్యి మరీ ఆమెను తన చిత్రంలోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటున్నారో బాగా తెలిసిన దర్శకుడు వి.వి.వినాయక్‌. అటు మాస్‌నీ, ఇటు యువతనీ సమంగా మెప్పిస్తారు. పూర్తిస్థాయి మాస్‌ అంశాలున్న చిత్రమిది. నా పాత్ర భిన్న కోణాల్లో కనిపిస్తుంది. మగధీర తరవాత కాజల్‌తో చేస్తున్న చిత్రమిది. చక్కటి సంగీతం తోడైందని అన్నారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ..మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఇప్పుడు చిత్రిస్తున్న ఫైట్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌ పాతబస్తీలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

mahesh-babu-happy-mood


నేను చేసిన పొరపాట్ల వల్లే... మహేష్ బాబు


ఇప్పుడంటే ఓకేగానీ... ఒకప్పుడు నాలో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌ ఉండేది. 'రౌండప్‌ చేసి నన్ను కన్‌ఫ్యూజ్‌ చెయ్యొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అని బిజినెస్‌మేన్‌లో ఓ డైలాగ్‌. సినిమాల్లో నన్ను కన్‌ఫ్యూజ్‌చేసే, టెన్షన్‌పెట్టే విలన్లు ఉన్నారుగానీ... నిజజీవితంలో మాత్రం అలా ఎవ్వరూ లేరు. కన్‌ఫ్యూజనంతా నేను చేసిన పొరపాట్ల వల్లే. అది కూడా ఇప్పుడు పోయింది. క్లారిటీ వచ్చింది అంటున్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేష్ బాబు తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే...నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫేజ్‌ ఇది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అందుకు కారణం... దూకుడు, బిజినెస్‌మేన్‌ సినిమాలే. వాటి భారీ విజయాలు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. 'ఒక్కసారి కమిటయితే నామాట నేనే వినను' - 'పోకిరి'లోని ఈ డైలాగు నాకు చాలా బాగా సరిపోతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నానంటే దానికే కట్టుబడతాను. 'మనం చేసే పనివల్ల మనకు ప్రయోజనం ఉండాలి. ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు...' - ఇదీ నా ఫిలాసఫీ. దీన్నే ఫాలో అవుతాను అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో పాటు సుకుమార్ దర్సకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.

magadheera-scenes-rachcha


రచ్చలో మగధీర హైలెట్ సీన్


రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం మగధీర. ఆ చిత్రంలోని హైలెట్ సీన్ అయ్యిన వందమందిని నరికే సీన్ తరహా సన్నివేశం ఒకటి రచ్చలో రిపీట్ అవుతోందంటూ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే అవి రూమర్స్ అని కొట్టి పారేస్తున్నా... అలాంటి ఎమోషన్ ని రిపీట్ చేస్తూ అంతమందిని ఒక్కసారిగా హీరో ఎదుర్కొనే సన్నివేశం మాత్రం ఉందని చెప్పుకుంటున్నారు.

ఇక రచ్చలో యాక్షన్ సీన్సే హైలెట్ కానున్నాయని సమాచారం. రామ్ చరణ్,తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం రచ్చ. ఈ చిత్రంలో హీరో.. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కథే రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగాలి. ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌ రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

Allari-naresh-socio-fantasy-flick-from-mar-17


గ్రాఫిక్స్ హైలెట్ గా అల్లరి నరేష్ సినిమా


అల్లరి నరేష్ కథానాయకుడిగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మాత చంటి అడ్డాల ఓ సోషియో ఫాంటసీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వినోద భరిత చిత్రం షూటింగ్ మార్చి 17న ప్రారంభం కానుంది. నరేస్ కెరీర్లోనే తొలిసారి అత్యధిక బడ్జెట్ తో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ వర్క్ నిర్మాణానికి ముందు నుంచే మొదలు పెట్టామని ఆయన తెలిపారు. సాధారణంగా షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ పనులకు శ్రీకారం చుడతారని, అయితే ఈ చిత్రం కోసం తాము ముందే గ్రాఫిక్స్ పనులను ఆరంభించడం ఓ విశేషమని అన్నారు. అలానే భారీ సెట్స్ కూడా చిత్రానికి మరో ఆకర్షణ అవుతాయని, సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సుమన్, సురేష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, షియాజీ షిండే, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సత్తిబాబు

Its-just-kiss-kajal


‘మహేష్ కు, నాకు కామన్...ఎక్కువ చేయొద్దు’


బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పటి మహేష్ బాబు ఏ హీరోయిన్ తోనూ అంత ఘాటుగా, అంత రొమాంటిక్ గా ముద్దు పెట్టుకోలేదు. ఈ విషయాన్ని ఇటీవల మరోసారి కాజల్ వద్ద ప్రస్తావించగా ఇలా స్పందించింది. ‘‘మహేష్ బాబు, నేను ప్రొఫెషనల్ నటులం, మా ఇద్దరి మధ్య అది కేవలం సినిమా ముద్దు మాత్రమే, మా ప్రొఫెషన్లో ఇవన్నీ కామన్, సీన్ డిమాండ్ చేసింది కాబట్టే ఆ సీన్ ఉంది, అంతే కాని దీనిపై ఎక్కువ చేయొద్దు, టూమచ్ గా చూడొద్దు’’ అంటూ స్పందించింది.

బిజినెస్ మేన్ సినిమా తన కెరీర్ లో మరిచిపోలేని సినిమా, ఈ ప్రాజెక్టులో నాకు స్థానం కల్పించినందుకు మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కు చాలా థాంక్స్ అంటోంది ఈ భామ. ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని, మరిచిపోలేని మంచి అనుభూతి అని చెప్పుకొచ్చింది.

బిజినెస్ మేన్ సినిమా తర్వాత కాజల్ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ తో తీయబోయే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో మాట్రాన్, తుపాకి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్రితం సంవత్సరం వరస పరాజయాలతో పెయిల్యూర్ హీరోయిన్ గా ముద్రవేయించుకున్న ఈమె ఈ సంవత్సరం తనకు పూర్తిగా కలిసివస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

Monday, February 20, 2012

pawan-targets-which-tv-channel


హాట్ టాపిక్: పవన్ టార్గెట్ ఏ టీవీ ఛానెల్ ?


పవన్ కళ్యాణ్ త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కెమెరామెన్ గంగతో రాంబాబు అనే టైటిల్ తో పూరీ జగన్నాధ్ రూపొందించే ఈ చిత్రం ఏ టీవీ ఛానెల్ ని టార్గెట్ చేయనున్నారనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ లో నే కాక మీడియా సర్కిల్స్ లో కూడా ఈ విషయమై తీవ్రంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ ని మాటల్ని వక్రీకరించి నెగిటివ్ గా ఓ ఛానెల్ చూపించిందని దానిపై ద్వజమెత్తనున్నారనే రూమర్స్ గుప్పుమంటున్నాయి. అయితే గతంలోనూ పూరీ తన సినిమాల్లో మీడియాను ఓ రేంజిలో ఏకి పారేయటంతో ఇప్పుడు కూడా అదే ఘాటుతో విరుచుకుపడతాడా అంటున్నారు. నేనింతే తరహాలో పూర్తిగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసి డైలాగులు రాసాడని చెప్పుకుంటున్నారు. ఇక మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

mahesh-babu-comments-on-six-pack


సిక్స్ ప్యాక్ పై మహేష్ బాబు కామెంట్


సిక్స్‌ప్యాక్‌ కోసం ప్రయత్నించాను. ముఖం అదోలా తయారైంది. ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టేశాను. ఫ్యూచర్‌లో ట్రై చేస్తానేమో అన్నారు మహేష్ బాబు. ఆయన్ని మీడియా వారు సిక్స్ ప్యాక్ చేయబోతున్నారని విన్నాము అంటే దానికి అలా స్పందించారు. అలాగే రకరకాల విషయాలపై తన అభిప్రాయాలు చెప్తూ...నేను ఇక్కడ థియేటర్లలో సినిమా చూడను. సినిమాలు చూడటానికి ముంబై వెళ్తాను. నాకు నచ్చిన సినిమాలన్నీ... ఒక సామాన్య ప్రేక్షకుడిలా చూసి ఎంజాయ్‌ చేస్తాను. అలాగే నేను ఇష్టపడే, సినిమా చేయాలనుకునే దర్శకుల్లో మొదటివ్యక్తి మణిరత్నం. అలాగని నాకు రీమేక్‌లు నచ్చవు అన్నారు.

ఇక సినిమాల్లో ఇన్వాల్వమెంట్ గురించి మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన చర్చల్లోగానీ సెట్స్‌లోగానీ... నేను నా క్యారెక్టర్‌ ఒక్కటే చూసుకుంటాను. మిగతా విషయాల్లో తలదూర్చను అని తేల్చి చెప్పారు. అలాగే నేను గతాన్ని పట్టించుకోను. వర్తమానంలో బతకడానికే ఇష్టపడతాను. దేవుణ్ణి నమ్ముతాను. పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాను. తిరుపతి వెంకటేశ్వరస్వామిని ఎక్కువగా దర్శించుకుంటాను. మన దేవాలయాలూ పుణ్యక్షేత్రాల్లో ఏదో మహత్తు ఉంది. అక్కడకు వెళ్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే త్వరలో సుకుమార్ దర్సకత్వంలో రూపొందే చిత్రం కూడా షూటింగ్ ప్రారంభం కానుంది.

rachcha-audio-launch-on-march-4


మార్చి 4.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగ

వచ్చే నెల(మార్చి) 4 వ తేదీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండుగ రోజు కానుంది. ఆ రోజునే రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియోని విడుదల చేయటానకి తేదీ ఖరారు చేసారు. ఆ రోజు నుంచే పబ్లిసిటీ క్యాంపైన్ ప్రారంభం కానుంది.

ఈ విషయమై నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ..కర్నాల్ టౌన్ లో మార్చి నాలుగున ఆడియోని విడుదల చేస్తామని అన్నారు. వేల కొలది అభిమానులు ఆ రోజు నాటికి అక్కడికి చేరుకుంటారని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. గ్రాండ్ గా ఆ ఫంక్షన్ ని చేయటానికి ఎరేంజ్మెంట్స్ గ్రాండ్ స్కేల్ లో చేస్తున్నారు. ఆ రోజు ఇండస్ట్రీలోని టాప్ డైరక్టర్స్ రాజమౌళి, పూరీ జగన్నాధ్, వివి వినాయిక్ హాజరుకానున్నారు. మరి కొంత మంది రామ్ చరణ్ స్నేహ వర్గంలోని హీరోలు కూడా ఈ పంక్షన్ కి హాజరవుతారు. తమిళ టాప్ డైరక్టర్ శంకర్ ని కూడా ఈ పంక్షన్ కి ఆహ్వానించినట్లు సమాచారం.

ఇక హీరోయిన్ తమన్నా, దర్శకుడు సంపత్ నంది, మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ అక్కడ ఎలాగో ఉండనే ఉంటారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

allu-arjuns-fight-sequeses-at-chennai


చెన్నై పోర్టులో అల్లు అర్జున్‌ గొడవ


అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నై పోర్ట్ లో జరుగుతోంది. అక్కడ అల్లు అర్జున్ గొడవపడి ఫైట్ చేసే యాక్షన్‌ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. వీటికి పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తున్నారు.

అక్కడ కలిసిన మీడియాతో ... తమ చిత్రం పోగ్రస్ గురించి నిర్మాత మాట్లాడుతూ.. 'బద్రినాథ్‌'లో పూర్తిస్థాయి యాక్షన్‌ హంగామా చూపించారు అల్లు అర్జున్‌. ఈసారి వినోదం బాట పట్టారు. బన్నీని కొత్త కోణంలో చూపించే కథ ఇది. త్రివిక్రమ్‌ శైలిలోనే సరదాగా సాగిపోతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ మేళవించాం. సంభాషణలు ఆకట్టుకొంటాయి. పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ ఘట్టాలను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. అవన్నీ మాస్‌ని అలరిస్తాయి. రాజేంద్రప్రసాద్‌ పాత్ర కీలకం. త్వరలో చిత్రం పేరుని అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు.

ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: డి.వి.వి.దానయ్య. 

about-srikanth's-devaraya-film


శ్రీకాంత్ 'దేవరాయ'అస్సలు మ్యాటరేంటి?


శ్రీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'దేవరాయ'. దొరబాబుగా, శ్రీకృష్ణ దేవరాయులుగా శ్రీకాంత్ కనిపించే చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఈ చిత్రాన్ని నానికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''గతం తెలుసుకొన్న మనిషి కథ ఇది. అమలాపురంలో దొరబాబు పేరు చెబితే చాలు... పేకాట రాయుళ్లు పండగ చేసుకొంటారు. ఎందుకంటే మనోడికి ఎప్పుడూ ముక్క తిరిగిందే లేదు. అందుకే దొరబాబుతో ఆడాలి, వాడి జేబులోని డబ్బులన్నీ మన చేతికి అందేయాలి.. అని కాపు కాస్తారు. అదొక్కటే కాదు.. దొరబాబుకు చాలా సరదాలే ఉన్నాయి. ఆ అలవాట్లతో ఇల్లూ వాకిలీ గుల్ల చేసుకొన్నాడు. ఆ తరవాత ఏమైంది? అసలు దొరబాబుకీ రాయలవారి వంశానికీ సంబంధం ఏమిటి? జల్సారాయుడిగా పేరుతెచ్చుకొన్న దొరబాబు గతమేంటి? అనేదే కథలో కీలకం. ఈ విషయాలు తెలియాలంటే 'దేవరాయ' సినిమా చూడాల్సిందే.

రెండు పాత్రల్లో శ్రీకాంత్‌ నటన ఆకట్టుకొంటుంది. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్‌లో మలి దశ చిత్రీకరణ మొదలుపెడతాం. బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు. విదిశ, మీనాక్షిదీక్షిత్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి నానికృష్ణ, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మాతలు.

ntr-puri-jagan's-film-muhurtham-fixed


ఎన్టీఆర్- పూరీ చిత్రం ముహూర్తం, రిలీజ్ డేట్ ఖరారు


ఎన్టీఆర్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఓకే అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి చెందిన ముహూర్తం, విడుదల తేదీలను పూరీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ఓపెన్ చేస్తారు. అలాగే రిలీజ్ ని సంక్రాంతి 2013 రోజున ఫిక్స్ చేసారు. ఈ విషయానికి ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ విడుదల చేసి ఘన విజయం సాధించిన పూరీ మళ్లీ సంక్రాంతికి ఎన్టీఆర్ తో హిట్ కొట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే మొదట మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం తీసి సంక్రాంతికి విడుదల చేస్తారని ఊహించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ పూరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో పూరీ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా చిత్రం విడుదలై డిజాస్టర్ అయ్యింది. అ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాను పవన్ తో చేయాల్సిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం స్క్రిప్టు పూర్తి చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ తన దమ్ము చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు.

bommarillu-bhaskar-next-film-with-ram


'బొమ్మరిల్లు భాస్కర్' నెక్స్ట్ ఆ హీరోతో ఖరారు


ఆరెంజ్ చిత్రం ప్లాప్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ రంగంలోకి వచ్చారు. ఆయన తాజాగా ఓ స్క్రిప్టు చేసుకుని హీరోని ఒప్పించుకున్నారు. ఆ హీరో రామ్ అని సమాచారం. మొదట అల్లు అర్జున్ కి చెప్పారు. అయ్యితే డేట్స్ ఇవ్వటానికి చాలా టైమ్ పట్టేటట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ హీరో కార్తీతోనూ చిత్రం అనుకున్నారు. అయితే ఆరెంజ్ మెగా ప్లాప్ తో అదీ మెటీరియలైజ్ కాలేదు. ఊసరవెల్లి నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం మే నుంచి ప్రారంభం కానుంది.

ఇక ప్రస్తుతం రామ్.. కరుణాకరన్ దర్సకత్వంలో ఎందుకంటే ప్రేమంట చిత్రం చేస్తున్నారు. అలాగే మరో ప్రక్క వీరూ పోట్ల దర్సకత్వంలోనూ ఓ చిత్రం కమిటయ్యారు. పవన్ కల్యాణ్ తో ఓకే కానీ ప్రాజెక్టుని రామ్ ఓకే చేసి చేస్తున్నారు. త్వరలోనే వీరూపోట్ల చిత్రం కూడా ప్రారంభం కానుంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం ప్యామిలీ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. వినోదానికి ప్రాముఖ్యత ఇస్తూనే కుటుంబవిలువలకు ప్రాధాన్యత ఇచ్చే కథ అని చెప్తున్నారు. ఇక ఈ కథతో మళ్లీ బొమ్మరిల్లు నాటి సక్సెస్ ను పొందుతానని భాస్కర్ ధీమాగా ఉన్నారు.

trisha-struggling-with-ntr


త్రిషను ఇబ్బందిపెడుతున్న ఎన్టీఆర్


ప్రస్తుతం త్రిష జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో నటిస్తోంది. అయితే పొల్లాచిలో జరుగుతున్న షూటింగ్ లో ఆమె చాలా ఇబ్బంది పడుతోంది అంటున్నారు. అక్కడో మాస్ సాంగ్ ని ఎన్టీఆర్,త్రిషలపై చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ వేసే స్పీడు స్టెప్పులకు ఆమె మ్యాచ్ కాలేక నానా యాతన పడుతోందని,టేక్ ల మీద టేక్ లు తింటోందని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన డాన్స్ లతో అదరకొట్టి తన తోటి యంగ్ బ్యాచ్ హీరోలకు పోటి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. దానికి తగ్గట్లుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టెప్ప్ లతో అదరకొడుతున్నారు. అయితే త్రిషకు అదే ఇబ్బందిగా మారింది. అతను స్టెప్ లకు మ్యాచ్ చేయటం త్రిషకు పెద్ద ఇబ్బందిగా మారిందిట. అలాగని ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలో లేరట. ఎలాగైనా తన అబిమానులకు ఈ చిత్రంతో పండగ వాతావరణం క్రియేట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు.

ఇక తన పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని త్రిష చెప్తోంది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...నేను ఎన్టీఆర్ తో ఇంతకుముందు రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది కానీ అవి మెటీరియలైజ్ కాలేదు. ఎన్టీఆర్ తో పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే బోయపాటి శ్రీను తో కూడా. ఇక ఈ చిత్రం నా పాత్ర.. మూడు రకాలుగా విభిన్నంగా సాగుతుంది. అందులో ఒకటి నేను రెగ్యులర్ గా చేసేది అంది త్రిష. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా ‘దమ్ము’ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు.

అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రంలో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం ‘దమ్ము’పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

samantha's-success-secret-revealed


‘దూకుడు’ని వదిలించుకున్నా..సమంత


‘దూకుడు’ నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా. అయితే ఆ సినిమా ఇచ్చిన కిక్‌ను ఎప్పుడో వదిలించుకున్నాను అంది సమంత. రీసంట్ గా ఆమె ఓ తమిళ ఛానల్‌కి చెందిన ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఆ ఛానెల్ వాళ్లు ఆమెను మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అని అడిగారు. దానికి ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అలాగే హిట్ కొట్టడం కష్టం కాదు. ఆ హిట్ ఇచ్చిన ఇమేజ్‌ని నిలబెట్టుకోవడం కష్టం. దానికి ఎంతో శ్రమించాలి. అందుకే సినిమాలను ఎన్నుకోవడం నుంచి, ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన మొత్తం ‘ఈగ’ పైనే. నా కెరీర్‌లోనే ఇది డిఫరెంట్ మూవీ అంది. ఇక తనకు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నటించడం కష్టం అనిపించటం లేదంటూ..కొంచెం ఇబ్బందిగానే ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల కెరీర్ కాస్త సాఫీగా సాగుతోంది అంది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ - గౌతమ్‌మీనన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో నటించబోతున్నాను. అయితే అది ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. సౌత్ సినిమాలకే నా తొలి ప్రధాన్యత. ఇక్కడ ఖాళీ దొరికితేనే అక్కడ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తోంది. అలాగే ఆమె నాని సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎటో వెళ్లి పోయింది మనస్సు చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది.

sunil-hikes-remuneration


రాత్రికి రాత్రే పెరిగిన సునీల్ రెమ్యునేషన్


కమిడియెన్ నుంచి సిక్స్ ప్యాక్ పెంచి మరీ యాక్షన్ హీరోగా మారాడు సునీల్. పూల రంగడు విజయంతో సునీల్ తో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అతని సిక్స్ ప్యాక్ కి,డాన్స్ లకే దక్కటం అతన్ని సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపధ్యంలో సునీల్ తన రెమ్యునేషన్ ని మూడు కోట్లకు పెంచినట్లు సమాచారం. గతంలో రోజుకు పది నుంచి పదిహేను లక్షలు వసూలు చేసిన సునీల్ తన రెమ్యునేషన్ పెంచి ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఎందుకంటే అతను ఇప్పుడు హిట్ లో ఉన్న హాట్ హీరో అని చెప్తున్నారు. యాక్షన్ హీరోలకు తగ్గని విధంగా చేసిన ఫైట్స్,డాన్స్ లు మాస్ ని ఊపేస్తున్నాయి. సినిమాలో కామెడీ కన్నా ఇవే ఎక్కువ పేలాయి. దాంతో ఆ రేంజి రెమ్యునేషన్ ని పెంచటం సమంజసమే అంటున్నారు. ఇక మీడియా మొత్తం పూల రంగడు చిత్రాన్ని సినిమా అంతా సునీల్ మయం. సునీల్ చేసిన ‘వన్ మేన్ షో’ అంటున్నారు. దాంతో రాత్రికి రాత్రే సునీల్‌ని స్టార్ హీరోని చేసేసిందీ సినిమా. దర్శకుడు వీరభద్రంచౌదరి సైతం సునీల్‌పైనే ఎక్కువగా శ్రద్ధ వహించి డిజైన్ చేసి హిట్ కొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ తో సునీల్ చేసిన ఫైట్ సినిమాకే హైలైట్ కావటం ప్లస్ అయ్యింది. దాంతో మూడు సంవత్సరాలు సునీల్ శ్రమ ఇలా వర్కవుట్ అయ్యి అతన్ని మూడు కోట్ల హీరోని చేసింది.

k.raghavendra rao-designing-pawan-carrer


ప్రస్తుతం పవన్ కి గాడ్ ఫాధర్ ఆయనే


పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫంధా మార్చి ప్రయోగాలను ప్రక్కన పెట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపు ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పు వెనకాల ఎవరు ఉన్నారు అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అని వినపడుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ కి గాడ్ ఫాధర్ లా వ్యవరిస్తున్నారని చెప్తున్నారు. ఆర్కా మీడియాలో చేసిన పంజా చిత్రం సమయంలో ఆ నిర్మాతల చుట్టమైన రాఘవేంద్రరావుతో పవన్ కి మంచి రాపో పెరిగిందని చెప్తున్నారు. దాంతో ఆయన సూచనల మేరకు అపజయాల నుంచి తప్పించుకోవటానికి కమర్షియల్ సినిమాలు ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. అందులో భాగమే గబ్బర్ సింగ్,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు అంటున్నారు. ఇక త్వరలో రాజమౌళి,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం కూడా ఈ స్టాటజీలో భాగమే అంటున్నారు. ఇక రాఘవేంద్రరావుకు కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా చాలా పేరుంది. గతంలో ఆయన రూపొందించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యి రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఆయన నాగార్జున హీరోగా షిర్డీ సాయి చిత్రం చేస్తున్నారు. పవన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Sunday, February 19, 2012

siddardha's-love-failure-success-meet


ఇప్పుడు నా వయస్సు ఎంతంటే..సిద్దార్ధ


హీరోగా, నిర్మాతగా... ఇకపై ఇలాంటి నాణ్యమైన చిత్రాలు మరెన్నో తీస్తానన్న నమ్మకముంది. ఇప్పుడు నా వయసు 32యేళ్లు. 'లవ్‌ ఫెయిల్యూర్‌' చిత్రాన్ని హిందీలోకి కూడా తీసుకెళ్లే ఆలోచన ఉంది అంటున్నారు సిద్దార్ధ. ఆయన హీరోగా చేస్తూ నిర్మించిన చిత్రం 'లవ్‌ ఫెయిల్యూర్‌'మొన్న శుక్రవారం విడుదలైంది. అమలాపాల్‌ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి బాలాజిమోహన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని సిద్దార్ధ నిర్వహించి ఈ రకంగా స్పందించాడు. అలాగే..విడుదలైన తొలి రోజునే... సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు నాకు చెప్పడం 'బొమ్మరిల్లు' తర్వాత 'లవ్‌ ఫెయిల్యూర్‌'కే జరిగింది అన్నారు సిద్ధార్థ్‌.'ఒక హీరో గానే కాకుండా... ఒక విజయవంతమైన నిర్మాతగానూ నన్ను నిలబెట్టిన చిత్రమిది. పదేళ్ల కాలంలో ఏమేం నేర్చుకొన్నానో అదంతా ఈ సినిమాకోసం ఉపయోగించాను.

నిర్మాణవ్యయం, చిత్రీకరణ రోజులు... ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాను. అందుకే ఇలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం నిర్మించినా విడుదలకు ముందే లాభాల్లో ఉన్నాను. కథలో కొత్తదనం, దానిపై నాకున్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేశాను. వ్యతిరేక భావాలున్న పేరుతో సినిమా తెరకెక్కించి విజయాన్ని అందుకోవడం అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడిగా బాలాజిమోహన్‌కి ఇది తొలి చిత్రమే అయినా... ఎంచుకొన్న కథాంశం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. అమలాపాల్‌ నటన, తమన్‌ సంగీతం, నీరవ్‌షా కెమెరా పనితనం ఈ చిత్రానికి కలిసొచ్చాయి అన్నారు.

ss.rajamouli's-assistant-direct-nagachaithanya


సునీల్ కి అనుకున్నది నాగచైతన్యతో...

 

ప్రముఖ దర్శకుడు రాజమౌళి అశోసియేట్ కోటి దర్శకత్వంలో త్వరలో నాగచైతన్య నటించనున్నారు. రాజమౌళి చిత్రాలకు చాలా కాలంగా పనిచేస్తున్న కోటి చెప్పిన యాక్షన్ కథకు వెంటనే ఓకే చేసి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కోటి ..నాగార్జున నటించిన రాజన్న చిత్రానికి కూడా పని చేసారు. ఇక కోటి కథతో గతంలో సునీల్ సినిమా చేద్దామని ప్రయత్నించారు. అందుకోసమే ఆయన సిక్స్ ప్యాక్ బాడీని పెంచారు. నెపోలియన్ టైటిల్ తో తెరకెక్కే ఆ చిత్రం బడ్జెట్ ఎక్కువ అవుతుందని అఫ్పట్లో సునీల్ తో విరమించుకున్నారు. ఇప్పుడు అదే సబ్జెక్టుని నాగచైతన్యతో చేయనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేసి యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవాలన్న కోరికతో ఉండటంతో ఈ సినిమాని వేరే ఆలోచన లేకుండా ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య..దేవకట్టా దర్శకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. వీరూ పోట్ల దర్సకత్వంలోనూ ఓ చిత్రం కమిటయ్యారు. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో అనుకున్న గౌరవం అనే ప్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం రద్దైనట్లు సమాచారం. త్వరలోనే నాగచైతన్య పూర్తి స్ధాయి యాక్షన్ హీరోగా కనపడనున్నాడన్నమాట.

ileana-rejects-pawan-kalyan


అవును..పవన్ ని రిజెక్ట్ చేసా:ఇలియానా


పవన్ కళ్యాణ్ సినిమాని ఇలియానా రిజెక్టు చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా న్యూస్ కరెక్టేనని ఇలియానా స్వయంగా చెప్పుకొచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ...అవును నేను రిజెక్టు చేసాను. ఎందుకంటే బాలీవుడ్ లో ఐటం సాంగ్ ని భారీగా చిత్రీకరిస్తారు. అందుకోసం స్పెషల్ సెట్స్ వేస్తారు. చాలా లావిష్ గా ఖర్చు పెడతారు. అందుకే అక్కడ హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్ లు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ సౌత్ లో పరిస్ధితి వేరు అందుకే కాదన్నాను అని తేల్చి చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్, ఇలియానా కాంబినేషన్ లో గతంలో జల్సా చిత్రం వచ్చి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇలియానాని పవన్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ కు అడిగారు. అయితే ఆమె నిర్విర్దంగా నో చెప్పేసింది. హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మున్నీ కా బద్నమ్ సాంగ్ కి ఇక్కడ డాన్స్ చేయమని అడిగారు. అప్పటికీ నిర్మాత గణేష్ బాబు ఈ పాట కోసం ఎనభై నుంచి కోటి రూపాయలు దాకా ఇవ్వటానికి సిద్దపడ్డారు.

Ram-charan-about-his-latest-rachcha


రచ్చకెక్కాక వెనుతిరిగి చూసుకోను:రామ్ చరణ్


ప్రేమైనా, పోరాటమైనా...ఒక్కసారి రచ్చకెక్కాక మాత్రం ఇక వెనుదిరిగి చూసుకోనని చెప్పే ఆ కుర్రాడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం 'రచ్చ'చూడాల్సిందే అంటున్నారు రామ్‌చరణ్‌. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న చిత్రం 'రచ్చ'. సంపత్ నంది దర్సకత్వంలో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఢిఫరెంట్ గా ఉంటుందంటున్నారు. ఈ చిత్రం పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా మీడియా తో రామ్ చరణ్ ఇలా స్పందించారు. అలాగే నిర్మాతలు ఈ చిత్రం గురించి చెపుతూ..''నేటితరం భావాల్ని అణువణువునా నింపుకొన్న ఓ యువకుడి కథ ఇది. దేనికీ తలొగ్గని అతను జీవితంలో సాధించిందేమిటో తెరపైనే చూడాలి. ప్రేమ, వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో చిత్రం సాగుతుంది. 'గ్యాంగ్‌లీడర్‌'లోని 'వానా వానా వెల్లువాయె...' రీమిక్స్‌ పాటకి రామ్‌చరణ్‌ వేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి. ఎన్వీప్రసాద్‌, పారాస్‌జైన్‌ నిర్మాతలు.

Auto-nagar-surya-film-latest-info


'ఆటోనగర్‌ సూర్య'కథ ఆ అంశాలు చుట్టూనే


వెన్నెల,ప్రస్దానం చిత్రాల దర్శకుడు దేవకట్టా తాజా చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. సూపర్ హిట్ చిత్రం 'ఏమాయ చేశావె'కాంబినేషన్ నాగచైతన్య-సమంత ని రిపీట్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సమాచారం తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. ఆటోనగర్‌ అడ్డాగా మార్చుకొన్న సూర్య ఏం చేశాడు? అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. దేవాకట్టా కథను చెప్పే విధానం తప్పకుండా ఆకట్టుకొంటుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగం కూడా త్వరితగతిన తెరకెక్కిస్తాము.ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం ''అన్నారు. ఇక ఈ చిత్రంలో సాయికుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఆమె ఈ చిత్రంలో తన పాత్ర గురించి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆమె మాట్లాడుతూ...‘ఆటోనగర్ సూర్య’లో పక్కా మాస్ కేరక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా గెటప్, డైలాగ్ డెలివరీ చాలా భిన్నంగా ఉంటాయి. డాన్సులు కూడా ఇందులో ఓ రేంజ్‌లో ఉంటాయి. చూడ్డానికి క్లాస్‌గా కనిపించే నేను ఆ సినిమాలో మాస్ లుక్‌తో ఆకట్టుకుంటా అంది. అలాగే క్లాస్ ఇమేజ్‌లో కొట్టుకుపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు మాస్‌గాళ్ ఇమేజే ఇష్టం. మాస్‌గా కనిపిస్తే ఆ కిక్కే వేరు. నేను నటించే సినిమాల్లో బీభత్సమైన డాన్సులు ఉండాలని కోరుకుంటాను. అప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా. సంగీతం: అనూప్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.

mahesh-sukumar-based-on-venky-sundarakanda


వెంకీ సినిమా ఆధారంగా...మహేష్-సుకుమార్ మూవీ?


మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు. స్వతహాగా లెక్చరర్ నుంచి దర్శకుడిగా మారిన సుకుమార్‌కు కాలేజీ బ్యాగ్రౌండ్ స్టోరీలను పర్ ఫెక్టుగా హ్యాండిల్ చేస్తాడనే మంచి పేరుంది. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ పుకారు మొదలైంది. గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సుందరకాండ’ సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారని, ఆ సినిమాలో మాదిరి ఇందులో లెక్చరర్ గా నటిస్తున్న మహేష్ బాబుకు, స్టూడెంట్ కు మధ్య ప్రేమాయణం ఉంటుందని, స్టోరీ కూడా ఆ సినిమాకు దగ్గరా ఉంటుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతో ఇప్పుడే చెప్పడం కష్టమే. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ‘దూకుడు’ నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ సరసన సమంత, వెంకీ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

sunil-journey-from-15-lakhs-3-crores


15 లక్షల కమెడియన్...ఇప్పడు 3 కోట్ల హీరో!


ఒక సాధారణ కమెడియన్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్రస్తుతం హీరోగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. కమెడియన్ నుంచి స్టార్ కమెడియన్‌గా ఎదగడం ఒక ఎత్తయితే...తన కామెడీ పర్సనాలిటీనా కండలు తిరిగిన హీరో పర్సనాలిటీగా మలుచుకోవడం మరో ఎత్తు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సునీల్ స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న కాలంలో సినిమాకు రూ. 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వాడని, అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాల ద్వారా హీరోగా టర్న్ అయ్యాక ‘పూల రంగడు’ చిత్రానికి రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసకున్నాడని చర్చించుకుంటున్నారు.

తాజాగా విడుదలైన సునీల్ పూల రంగడు....రవితేజ ‘నిప్పు’ సినిమాను సైతం వెనక్కి తోసి హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో సునీల్ కెరీర్‌కు ఇక తిరుగుండదనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే సునీల్ రెమ్యూనరేషన్ మరింత పెరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదని సినిమా ట్రేడ్ వర్గాలంటున్నాయి.

అకుంటిత దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల అనడానికి హీరో సునీల్ నిదర్శనం. 108 కేజీల బరువుండే ఈ యాక్టర్ మజిల్స్ బాడీ బిల్డ్ చేయడానికి మూడేళ్ల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చాడంటే అర్థం చేసుకోవచ్చు అతని కమిట్ మెంట్ ఏ రేంజ్ లో ఉందో...

Tapsi-demanded-more-remuneration


సూర్య-రవితేజ మూవీ నుంచి తాప్సీని తప్పించారా?

సూర్య, రవితేజ కాంబినేషన్లో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రధాన హీరో కాగా, రవితేజ సెకండ్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన సోనమ్ కపూర్, రవితేజ సరసన తాప్సీ ఖరారు అయినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయతే తాప్సీ మాత్రం ఈ సినిమాలో నేను నటించడం లేదు, ఈ వార్త ఎలా వచ్చిందో తనకు తెలియదు అంటోంది.

అయితే ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం రవితేజ సరసన తాప్సీని తీసుకోవాలని అనుకున్నామని, ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని, ఈ క్రమంలోనే విషయం మీడియాకు లీకైందని అంటున్నారు. కానీ తాప్సీ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆమెను తప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాప్సీ ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రల్లో నటిస్తోంది. మంచు లక్ష్మి నిర్మిస్తున్న గుండెల్లో గోదారి చిత్రంలో మఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. దీంతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న దరువు చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘షాడో’ చిత్రంలో వెంకీ సరసన రొమాన్స్ చేయనుంది.

Dasari-movie-about-devadasi


దాసి వ్యవస్థపై దాసరి -జంకుతున్న హీరోయిన్లు?


గతంలో ఒసేయ్ రాములమ్మ లాంటి సెన్సేషన్ సినిమాలు రూపొందించిన దర్శక రత్న దాసరి నారాయణరావు మరోసారి అలాంటి తరహా సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో అధికంగా కనిపించే ‘దేవదాసీ’ దురాచారాన్ని బేస్ చేసుకుని ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని, లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అన్వేషన్ సాగుతోందని సమాచారం. అయితే ఆ పాత్రలో నటించనున్న హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

దాసరి ఇటీవల రూపొందించిన యంగ్ ఇండియా, పరమ వీర చక్ర సినిమాలు ఘోరంగా పరాజయం పాలు కావడం, ప్రస్తుతం సినిమాలపై ఆయన ఆలోచనలు ఇప్పటి జనరేషన్‌కు తగిన విధంగా లేవనే వాదనల నేపథ్యంలో దాసరి రూపొందిస్తున్న ఈ సినిమాలో నటించడానికి ప్రముఖ హీరోయిన్లు ఎవరూ ముందుకు రావడం లేదని, కెరీర్ స్పాయిల్ అవుతుందేమోనని జంకుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య దాసరి పలు సందర్భాల్లో పలువురు హీరోయిన్లను విమర్శించడం వెనక ఇది కూడా ఓ కారణమనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

Friday, February 17, 2012

kamal-talks-reviving-marudhanayagam-with-rajini


రజనీ, కమల్ కాంబినేషన్ పై అఫీషియల్ గా...


ఎప్పటినుంచో రజనీ,కమల్ కలిసి నటిస్తే మళ్లీ చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చినట్లుంది. కమల్ హాసన్ ఈ వివరాలను ముంబైకి చెందిన ఓ పత్రికతో మాట్లాడుతూ వివరించారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''రజనీకాంత్‌, నేను ప్రారంభం రోజుల్లో పది సినిమాలు దాకా కలిసి చేసాం. అయితే ఆ తర్వాత మేము కలిసి నటించేందుకు అనువైన కథ దొరక్క ఇన్నాళ్లూ నటించలేదు. అయితే దీనికి పరిష్కారం నేనే కనుక్కొన్నా. గతంలో నేను తీద్దామని ఆపిన 'మరుదనాయగమ్‌' చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ తెరకెక్కిద్దామనుకుంటున్నా. ఇందులో రజనీకి అనువైన పాత్ర ఉంది. అందులో ఆయన నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు.

1997లో 'మరుదనాయగమ్‌' చిత్రాన్ని కమల్‌ రూపొందించాలనుకున్నారు. అయితే బడ్జెట్‌ సమస్య కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ల్లో రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో ఉన్నారు కమల్‌. ఇక ఈ వార్త రజనీ,కమల్ అభిమానుల్లో ఆనందం నింపింది.

ram-charans-film-on-oil-mafia


ఆయిల్ మాఫియా పై రామ్ చరణ్ చిత్రం ఖరారు


ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే రామ్ చరణ్ ని తన కథకు ఎంపిక చేసుకోవటం గురించి చెపుతూ...నేను ఓ యంగ్ ,ఎనర్జీ ఉన్న యంగ్ హీరో కోసం వెతికాను. జంజీర్ కథ కోపంతో రగిలిపోయే యాంగ్రీ యంగ్ మ్యాన్ కథ. ఈ రోజున బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసే యంగ్ హీరోలు లేరు. అంతా మెట్రో సెక్సువల్ హీరోలే అన్నారు. ఆ ఫైర్ రామ్ చరణ్ లో కనిపించింది. అందుకే అతన్ని కలిసి ఒప్పించుకున్నాను అన్నారు.

ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారని,అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందనుందని తెలుస్తోంది.ఈ చిత్రం 2012 ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాల సమాచారం.

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్’ 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
 

Dasari-buys-allu-arjun-trivikram-film


బన్ని, త్రివిక్రమ్ చిత్రం రైట్స్ రికార్డు రేటు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రైట్స్ కు మార్కెట్లో ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం రైట్స్ ని దాసరి నారాయణ రావుకి చెందిన సిరీ మూవీస్ వారు తీసుకున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ క్రింద ఈ మొత్తం చెల్లించారు. అల్లు అర్జున్ చిత్రాల్లో రికార్డు రేటుకు పోయినట్లు సమాచారం. జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు.

ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్యాంక్ దోపిడీ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. అక్కడ జరిగే కామిడీ సినిమాని ఓ హిలేరియస్ గా ఉండి నిలబెడుతుందంటున్నారు. ఇందుకోసం త్రివిక్రమ్ .. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ స్పెషల్ సెట్ వేయించి చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం స్నేహం ప్రధానాంశంగా దొంగతనం నేపధ్యంలో జరుగుతుందని చెప్తున్నారు. బద్రీనాధ్ తర్వాత బన్నీ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే త్రివిక్రమ్ కూడా తన ఖలేజా అనంతరం గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇదే కావటంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుని మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.

multi-city-audio-launch-dammu


'దమ్ము' స్పెషల్.. మల్టీ సిటీ ఆడియో పంక్షన్

 

జూ ఎన్టీఆర్, త్రిష కాంబినేషన్ లో రూపొందుతోన్న దమ్ము చిత్రం ఆడియో ఉగాది రోజున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఆడియో పంక్షన్ ని విభిన్నంగా చేయాలని నిర్మాత అలగ్జాండర్ వల్లభ ప్లాన్ చేస్తున్నారు. మల్టి సిటీ ఆడియో ఫంక్షన్ గా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. అంటే మూడు సిటీల్లో ఒకే సారి అభిమానుల మధ్య ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. దాంతో ఆ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు. అంతేగాక ఆడియోకు అదనపు పబ్లిసిటీ వస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి సినిమాకు పాటలు హైలెట్ గా నిలిచేలా ప్రత్యేకంగా ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. జూనియర్ సరసన త్రిష కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా... పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. బోయపాటి శ్రీను దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

aditya-paid-huge-amount for rachcha-music


షాకిచ్చే రేటుకు'రచ్చ'ఆడియో రైట్స్

 

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ప్రతీ విషయంలో ఏదో ఒక సంచలనానికి తెర తీస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్మి రికార్డు క్రియేట్ చేసింది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట ఇప్పటికే నెట్ లో లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్ లో చేయటం లేదు. ఈ పంక్షన్ ని గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో .. కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదట వారు తిరుపతిలో ఆడియో విడుదల అనుకున్నారు కానీ అక్కడ రామ్ చరణ్ వివాహ రిసెప్షన్ పెట్టుకోవటంతో ఇలా మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఆడియో విడుదల చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ... రచ్చ... అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

seethamma-vakitlo-sirimalle-chettu-latest-info


'గ్రీకు వీరుడు' టైప్ లో మహేష్ పై సాంగ్


ఆరడుగుల అందగాడు.. వచ్చేనా నాతో...ఏడుగులు నడిచేనా అనే పాటను సమంతపై రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కోసం చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ పాట..నిన్నే పెళ్లాడతా చిత్రంలో నాగార్జున ని ఉద్దేశిస్తూ టబు పాడే గ్రీకు వీరుడు తరహా పాటలాగ ఉండబోతుందని సమాచారం. అటు సమంత పాడుతూంటే ఇటు మహేష్ ఇంట్రడక్షన్ జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఈ నెల 16 నుంచి మహేష్ షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికి ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. 16 నుంచి సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇక మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతను ఎంపిక చేసారు. సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ ఈ చిత్రం కోసం రెండు పాటలను ఆల్రెడీ సిద్దం చేసారు. అతను శ్రీకాంత్ గత చిత్రం కొత్త బంగారు లోకం కోసం కూడా సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. మహేష్ బాబు ఫేవెరెట్ కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందిస్తున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. అలాగే మహేష్, వెంకటేష్ అన్నదమ్ములగా కనిపించనున్నారని, ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రకు ఎంపిక చేసారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు.. అంటే కుటుంబం అని కాన్సెప్టు తో ఈ చిత్రం నిర్మితమవుతోంది.

aishwarya-rai-pair-up-with-pawan-kalyan


పవన్ సరసన పెళ్లైన హీరోయిన్ ఎంపిక!?


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రోజుకో కొత్త వార్తతో వేడిక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె గతంలో అంటే 13 సంవత్సరాల క్రితం తెలుగులో రావోయి చందమామ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇక ఈ వార్త ..రూమర్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. దానికి కారణం అమితాబ్ తో బుడ్డా చిత్రం చేసిన పూరికి వారి సంస్ధ నుంచి రావాల్సిన ఎమౌంట్స్ ఇంకా సెటిల్ కాలేదు. అలాంటి పరిస్ధితుల్లో ఆమెను ఎందుకు తీసుకుంటారని అంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు.

మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ram-charan-play-robin-hood


రాబిన్ హుడ్ పాత్రలో రామ్ చరణ్?


రామ్ చరణ్ త్వరలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనపడి అలరించనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ తరహా క్యారక్టరైజేషన్ ఉండబోతుందని అంటున్నారు. పెద్దలను కొట్టి ..పేదలకు పెట్టే పాత్రలో రామ్ చరణ్ అదరకొడతాడని చెప్పుకుంటున్నారు. ఆ పాత్ర మాస్ కి బాగా నచ్చుతుందని, ఆ పాత్రలో రామ్ చరణ్ ఎక్సట్రీమ్ లెవిల్స్ వెళ్లి ఫెరఫార్మ్ చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కథ ప్రకారం హీరో తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఏం చేసాడనే పాయింట్ చుట్టూ తిరిగుతుంది. కథలో చిన్నపాటి టెన్షన్ కూడా ఉంటుంది. మంచి యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ సినిమా.

గతంలో వినాయిక్ చిత్రాలైన లక్ష్మి,కృష్ణలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ..ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నారు. కణల్‌ కన్నన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ బ్యానర్ పై నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.'మగధీర' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు

Mistake-pawan-puri-movie-title


‘కెమెరామెన్ గంగతో రాంబాబు’టైటిల్ కరెక్టు కాదా?


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో గంగ ఎవరనే దానికి రెండు రోజుల క్రితం రైటర్ బివియస్ రవి ట్వట్టర్ ద్వారా సమాధాన మిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ కి పూరి తో పాటు బ్యాంకాక్ వెళ్లిన రైటర్ బివియస్ రవి ట్వీట్ చేస్తూ... గంగ అనేది హీరోయిన్ పేరు... రాంబాబు హీరోయిన్ ఆమె అన్నారు. అయితే ఇప్పుడు ఇది వినగానే చాలా మందికి కెమెరామెన్ అంటే మగ కదా...హీరోయిన్ ని కెమెరా ఉమెన్ అనాలి కదా అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి. కానీ పూరీ ఇవన్నీ ఆలోచించకుండా ఈ టైటిల్ పెట్టరు కదా అనే డైలమో కూడా ఉంది. దానికి కొందరు ... డిక్షనరీ ప్రకారం కెమెరామెన్ అంటే.. సినిమాకి గానీ టీవి కి కానీ కెమెరాని హ్యాండిల్ చేసే ఎవరైనా కెమెరా మెన్ అంటారు అని ఉంది అని తేల్చారు. కాబట్టి జెండర్ డిఫెరెన్స్ లేకుండా కెమెరా ఎవరు హ్యాండిల్ చేసినా కమెరామెన్ అంటారు కాబట్టి టైటిల్ లో ఏ గ్రామర్ మిస్టేక్ లేదని అంటున్నారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రెడీ అవనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

magazine-apologizes-shruti-haasan


అఫైర్ వార్తపై శృతిహాసన్‌కు పత్రిక క్షమాపణలు


మొత్తానికి వీక్లీ మ్యాగజైన్ శృతిహాసన్ కి క్షమాపణ చెప్పింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ శృతి ట్వీట్ చేస్తూ... ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు..నా మీద ఫేక్ కథనం రాసిన వీక్లీ మ్యాగజైన్ క్షమాపణ చెప్పింది. అల్టిమేట్ గా నిజం ఏమిటనేది ప్రపంచానికి తెలిసింది అంది. ఇక క్రితం నెలలో ఆమెపై ధనుష్, శ్రుతిల ఎఫైర్ గురించి ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనం హాట్ టాపిక్ అయ్యింది. అందులో ఈ నెల 1న ఐశ్వర్య బర్త్‌డేకి కూడా ధనుష్ టైమ్ కేటాయించలేదని, ఆ సమయంలో శ్రుతితో పార్టీ చేసుకున్నారని కూడా రాసుకొచ్చింది. దినపత్రికలో న్యూస్ వచ్చిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని చెన్నయ్‌ వర్గాలు ఫిక్స్ అయ్యాయి. దాంతో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

మరో ప్రక్క ఈ చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాల్లో ధనుష్, శ్రుతి మొహమాటం లేకుండా లీనమై నటించడం కూడా సంచలనమైంది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది కాబట్టే ఇంతగా లీనమయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు. శ్రుతిహాసన్‌తో స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత ధనుష్ తన భార్యను పట్టించుకోవడంలేదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇవన్నీ చదివిన రజనీకాంత్ తలపట్టుకుని కూర్చున్నాడుట. దాంతో ఇక శృతి కలగచేసుకుని ఇలా ఖండనలు పేరుతో మీడియాని తిట్టిపోసింది. చివరకు ఆ పత్రికకు నోటీస్ పంపింది. దాంతో ఆ పత్రిక దిగి వచ్చి ఆమెకు సారి చెప్పింది. దాన్ని తన ట్విట్టర్ లో రాసి తన కసి తీర్చుకుంది శృతి.

robbery-scene in allu-arjuns-film


అదరకొట్టనున్న అల్లు అర్జున్ బ్యాంక్ దోపిడీ సీన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బ్యాంక్ దోపిడీ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. అక్కడ జరిగే కామిడీ సినిమాని ఓ హిలేరియస్ గా ఉండి నిలబెడుతుందంటున్నారు. ఇందుకోసం త్రివిక్రమ్ .. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ స్పెషల్ సెట్ వేయించి చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం స్నేహం ప్రధానాంశంగా దొంగతనం నేపధ్యంలో జరుగుతుందని చెప్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో పోలీస్ గా రాజేంద్రప్రసాద్ నటనకూడా హైలెట్ అవుతుందని చెప్తున్నారు. ఇందుకోసం దేవిశ్రీప్రసాద్ మరో ప్రక్క యూత్ కి కిక్కు ఎక్కించే పాటలతో రెడీ అవుతున్నాడు. ఇలియానా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రం త్రివిక్రమ్ కి మళ్లీ స్టార్ డైరక్టర్ గా మరో మెట్టుకు తీసుకువెల్తుందని చెప్పుకుంటున్నారు. బద్రీనాధ్ తర్వాత బన్నీ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే త్రివిక్రమ్ కూడా తన ఖలేజా అనంతరం గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇదే కావటంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుని మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.

Thursday, February 16, 2012

Boyapati srinu-about-dammu


అందుకే 'దమ్ము'న్న మొగాడు ఎన్టీఆర్

 

ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దమ్ము'. ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొలాచ్చిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ పాటలు, కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు.

త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్‌ వల్లభ నిర్మాత. ఉగాదికి పాటల్ని విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్‌ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్‌ యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.

raviteja's-nippu-preivew


లక్ష్యం లేని ఒక్కడు ('నిప్పు'ప్రివ్యూ)


విషయం: నారాయణమూర్తి (రాజేంద్రప్రసాద్‌)కి ముగ్గురు కూతుళ్లు. వారికి తగిన భర్తల్ని తీసుకురావాలనేది ఆయన ఆశ. మేఘన (దీక్షాసేథ్‌) ఓ అథ్లెట్‌. జాతీయస్థాయిలో పతకాలు సాధించాలనేది ఆమె లక్ష్యం. ఆధిపత్యపోరులో తనే విజేత కావాలని, గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనేది రాజాగౌడ్‌ (ప్రదీప్‌రావత్‌) ఆశయం. ఇలా ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యమంటూ ఉంది. ఒక్కరికి తప్ప... అతనే సూర్య (రవితేజ). లక్ష్యమంటూ లేకపోవడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యం.. అని నమ్మే వ్యక్తి అతను. నారాయణమూర్తి, మేఘన, రాజాగౌడ్‌.. వీరందరి ఆశలకు, ఆశయాలకూ సూర్యకూ సంబంధం ఏమిటి? మధ్యలో శ్రీరాం (శ్రీరాం) ఎవరు? ఈ విషయాలతో అల్లుకొన్నదే ఈ సినిమా.

ఈ చిత్రం గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ...తమ నిప్పు చిత్రం మాస్‌కోణంలో వినోదాత్మకంగా అందరినీ ఆకట్టుకునేవిధంగా ఆయన పాత్ర మలచబడిందని అన్నారు. లోగడ నా చిత్రాలు 'చూడాలనివుంది', 'ఒక్కడు' ఓవర్‌సీస్‌లో సంచలనం సృష్టించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా అక్కడి వారినందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే ..కథ, కథనాలే మా సినిమాకి ప్రధానబలం. ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం ఉంది. రవితేజ నటన ఎప్పటిలా హుషారుగా ఉంటుంది. తమన్‌ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. రాజేంద్రప్రసాద్‌ నటన అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కులను సుప్రీం మూవీస్‌ సొంతం చేసుకోగా, ఉత్తర అమెరికాలో ప్రణీత్‌ మీడియా చిత్రాన్ని విడుదల చేస్తోంది.


సంస్థ: బొమ్మరిల్లు
నటీనటులు: రవితేజ, దీక్షాసేథ్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్‌, కృష్ణుడు, బ్రహ్మాజీ, సుప్రీత్‌, జయప్రకాష్‌ రెడ్డి, ప్రగతి తదితరులు
సంగీతం: తమన్‌
నిర్మాత: వై.వి.ఎస్‌.చౌదరి
దర్శకత్వం: గుణశేఖర్‌
విడుదల: 17.02.2011 శుక్రవారం.

sudhir applauds mahesh babu-sms-film-success-meet


మహేష్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమ...


మహేష్‌ల అభిమానులు నాపై చూపించిన ప్రేమ ఈ సినిమా ఓపెనింగ్స్‌లో కనిపించింది. ఇంత సక్సెస్‌ని నేను ఊహించలేదు అంటున్నారు సుధీర్ బాబు. మహేష్ బావ అయ్యిన సుధీర్ బాబు హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘ఎస్‌ఎంఎస్’. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో తాతినేని సత్య దర్శకత్వంలో విక్రమ్‌రాజ్ నిర్మించిన ఈ చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఆ ఉత్సాహాన్ని పంచుకోవటానికి హైదరాబాద్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే... విడుదలకు ముందు ‘ఎస్‌ఎంఎస్’ చిన్న సినిమా. విడుదలయ్యాక పెద్ద సినిమా అయ్యింది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి త్వరలోనే సక్సెస్ టూర్‌కి వెళ్లనున్నాం అని అన్నారు.

ఇక హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ.. మరచిపోలేని అనుభూతినిచ్చిందీ సినిమా అన్నారు. ఇక దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ..‘‘ఆర్బీ చౌదరిగారికి ఈ కథపై ఎంతో నమ్మకం. అందుకే 245 కేంద్రాల్లో విడుదల చేశారు. వారి నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసింది’’ అని అన్నారు. ‘అలా మొదలైంది’ తర్వాత తనకు ఆ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా ఇదని తాగుబోతు రమేష్ అన్నారు. ఇంకా కాశీ విశ్వనాథ్, డాన్స్ మాస్టర్ శేఖర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

siddharth-love-failure-gets-no-cuts


సిద్ధార్థ ‘లవ్ ఫెయిల్యూర్’ సెన్సార్ రిపోర్టు జీరో...!

సిద్ధార్థ-అమల పాల్ జంటగా రూపొందుతున్న ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా జీరో కట్స్ తో క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సంపాదించుకుంది. పిబ్రవరి 17న ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన హీరో సిద్ధార్థ స్వయంగా ఈచిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేసుకుంటుండగా....నిర్మాత బెల్లంకొండ సురేష్ అతనికి సహాయం చేస్తున్నాడు. బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతం సమకూర్చాడు.

కె.వేణుగోపాల్‌, సిద్ధార్థ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సిద్దార్ధ ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...ప్రేమలో నేను చాలాసార్లు విఫలమయ్యాను. అందుకే ఈ కథలో చక్కగా ఇమిడిపోయాను. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించాలని భావించేవాళ్లు ఈ చిత్రాన్ని చూస్తే తప్పకుండా తగిన ఫలితం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రం కథ విషయానికొస్తే....అమలా పౌల్ పార్వతి అనే పాత్రను పోషిస్తోంది. ఆమెకు అందం, తెలివితేటలు.. రెండూ ఎక్కువే. అందుకే ఆమెపై సిద్దార్ధ అనే కుర్రాడు మనసుపడతాడు. దేవదాసు తరహాలో ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం కుదరదని, అలాంటివి తనకు ఇష్టం ఉండవని తేల్చి చెప్పింది. అలాంటి పరిస్దితుల్లో ఆ భగ్నప్రేమికుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేదే మిగతా కథ.

ప్రస్తుతం సిద్ధార్థ్ అలామొదలైంది ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సిద్ధార్థకు జంటగా సమంత నటిస్తోంది. బెల్లకొండ సురేష్ నిర్మాత. ఇటీవలే ఈచిత్రం లాంఛనంగా ప్రారంభం అయింది.

Wednesday, February 15, 2012

naga-chaitanya-gouravam-halted


నాగచైతన్య ‘గౌరవం’ఇప్పుడు లేనట్లేనా?


అక్కినేని యువ హీరో నాగచైతన్య హీరోగా రాధామోహన్ దర్శకత్వంలో ‘గౌరవం’ అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించారు. నాగార్జున తన సొంత బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యాడు కూడా. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వరుస ప్లాపులతో ఉన్న నాగ చైతన్య మరో నాలుగైదు కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు చేసి కెరీర్ గాడిలో పడ్డ తర్వాత ‘గౌరవం’ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాధా మోహన్ దర్శకత్వం వహించే ‘గౌరవం’ సినిమా క్లాస్ పీపుల్ మాత్రమే చూసే సినిమా కావడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చక పోవచ్చని,అందుకే కొంత గ్యాప్ తీసుకోవాలని చైతు నిర్ణయించుకున్నాడట.

ప్రస్తుతం నాగచైతన్య ఆటోనగర్ సూర్య చిత్రంలో షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి దేవ కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. ఇదే కాక నాగచైతన్య, దర్శకుడు వీరూ పోట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది. గతంలో వీరూ పొట్ల నాగార్జునతో ‘రగడ’, మనోజ్ తో ‘బిందాస్’ చిత్రాలు రూపొందించారు. ఈ రెండు సినిమాలు బాక్సీఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించాయి. ఈ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వీరూ పొట్ట నాగచైతన్యతో మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

puri-jagannath-cameraman-ganga-role


పవన్ కెమెరామెన్ ‘గంగ’ పాత్రలో పూరి జగన్నాథ్?


పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు పాత్రలో కనిపించనున్నాడు. అయితే గంగ పాత్రను ఎవరు చేస్తున్నారు? గంగ అంటే ఆడా..? మగా...? అనే సందేహాలు మొదటి నుంచి ఉన్నాయి. సినిమా టైటిల్ లో కెమెరా‘మెన్’ అని ఉంది కాబట్టి ‘గంగ’ పాత్ర కచ్చితంగా మగ పాత్రే అని స్పష్టం అవుతోంది.

మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే దానిపై సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న గాసిప్ప్ ప్రకారం గంగ పాత్రలో స్వయంగా పూరి జగన్నాథ్ నటించాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిజినెస్ మేన్ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా తెరపై దర్శనం ఇచ్చిన పూరి......ఈ సినిమా ద్వారా నటుడిగా పూర్తి స్థాయిలో తెరంగ్రేటం చేయబోతున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో మరికొన్ని రోజుల్లో స్పష్టం కానుంది.

ఈచిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య యూనివర్శల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రవితేజ హీరోగా ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగులో బిజీగా గడుపుతున్నాడు.
 

ravi-teja-puri-film-launch-on-17th


మరో రెండు రోజుల్లో రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’


సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభం కానుంది. పూరి ఆఫీస్ లోనే ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణ జరుగనుంది. మార్చి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూరి ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రవితేజ-పూరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు భారీ విజయం సాధించాయి. నేనింతే సినిమా మాత్రం నిరాశ పరిచింది.‘దేవుడు చేసిన మనుషులు’ ఈ ఇద్దరి కాంబినేషన్లో వయస్తున్న 5వ సినిమా. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానాను ఎంపిక చేశారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ఈ సినిమా ప్రారంభం రోజు రవితేజ నటించిన ‘నిప్పు’ చిత్రం విడుదలవుతుండటం విశేషం. ప్రస్తుతం రవితేజ ‘దరువు’ చిత్రంలో నటిస్తున్నాడు. శౌర్యం ఫేం శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సౌండ్ ఆఫ్ మాస్ అనే సబ్ టైటిల్ తో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయిక.

venkatesh-flying-australia-shadow


షాడో షూటింగ్: ఆస్ట్రేలియాలో వెంకీ అండ్ టీం

విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘షాడో’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ మేరకు వెంకీతో పాటు ముఖ్య తారాగణం, టెక్నీషియన్స్ ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా వెళ్లారు. సినిమాలోని ముఖ్య తారాగణం మీద ఇక్కడ పలు యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారు. వెంకటేస్ ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనిపించబోతున్నారు.

యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సి నటించనుంది. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. వెంకీ డాన్ పాత్ర అనగానే ఈ సినిమా సిరీయస్ గా సాగుతుందనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో కామెడీ టచ్ కూడా మెండుగా ఉంటుందని అంటున్నారు ఈచిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్. సినిమా పేరుకు తగిన విధంగానే మాఫియా బ్యాగ్రౌండ్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఫన్నీగా ఉంటుందని ఆయన తెలిపారు.

మరో వైపు వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. జర్నీ ఫేం అంజలి వెంకీకి జోడీగా నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈచిత్రంలో మరో హీరో పాత్రలో నటిస్తున్నాడు, అతనికి జోడీకి సమంత ఎంపికైంది.

dhoni-fails-make-money


ప్రకాష్ రాజ్ 'ధోని' కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?


ప్రకాష్ రాజ్ డ్యూయెట్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ధోని'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అంతటా మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా చాలా వీక్ గా ఉందని సమాచారచం. ఇరవై నుంచి ముప్పై పర్శంట్ వరకూ ఈ చిత్రానికి వ్యూయిర్ షిప్ వస్తోందంటూ ఓ ఇంగ్లీష్ డైలీ ఈ రోజు కధనం ప్రచురించింది. ధీమాటిక్ ఫిల్మ్ గా ఈ చిత్రం మేధావులు ప్రశంసలు అందుకుంటున్నా సామాన్యుడుని అలరించటంతో ఇది మిస్సవుతోంది. ముఖ్యంగా సినిమాలో రెగ్యుల్ స్టార్ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ గా మారిందని అంటున్నారు.

ఈ చిత్రంలో పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌.. కార్తిక్ గా ప్రధాన పాత్రను పోషించాడు. ఇక ఈ చిత్రం స్టోరీ లైన్ .. కార్తీక్‌ తొమ్మిదో తరగతి విద్యార్థి. పన్నెండో ఎక్కం రాదు. కానీ ధోని సగటు ఎంతో కచ్చితంగా చెప్పేస్తాడు. దూరం, కాలం ఇలాంటి లెక్కలు రావు. కానీ ఇషాంత్‌ శర్మ విసిరిన బంతి ఎన్ని మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందో చెప్పగలడు. బంతి బరువెంత? బ్యాటు పరిమాణం ఎంత? ఇవన్నీ సరిగ్గా తూకమేసినట్టు వల్లిస్తాడు. మొత్తమ్మీద పుస్తకాల మీదకంటే... మైదానంలో క్రికెట్‌ ఆటపైనే ఆసక్తి. ఈ ప్రేమను కార్తీక్‌ నాన్న సుబ్రహ్మణ్యం అర్థం చేసుకొన్నాడా? కార్తీక్‌ 'ధోని'లా ఎదిగాడా? లేదా? అన్న విషయాల చుట్టూ కధ నడుస్తుంది. మరాఠీలో మహేష్ ముంజ్రేకర్ చేసిన చిత్రం ఆధారంగా ఈ సినిమాని ప్రకాష్ రాజ్ రూపొందించారు. ఈ చిత్రంలో రాధిక ఆప్టే, తనికెళ్ల భరణి, నాజర్‌, మురళిశర్మ, ఆనంద్‌, హేమ, శ్రీతేజ, మెల్కోటే తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, పాటలు: సీతారామశాస్త్రి, సంగీతం: ఇళయరాజా.

gopichand-haritha-marriage-canceled


హీరో గోపీచంద్-హరిత పెళ్లి రద్దు


తెలుగు హీరో గోపీచంద్ వివాహం హరిత అనే అమ్మాయితో ఖరారైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఫిబ్రవరి 24న పెళ్లి జరుగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వివాహం రద్దయినట్లు తెలుస్తోంది. అసలు కారణాలు తెలియరాలేదు కానీ....పర్సనల్ ప్రాబ్లమ్సే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది. సినీ హీరో అయిన గోపీచంద్ కు...ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన హరితతో వివాహం ఫిక్స్ కావడంతో సంతోషంగా ఉన్న గోపీచంద్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ విషయంతో షాక్ అయ్యారు. గోపీచంద్ కు ఓ ప్రముఖ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని గతంలో వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం కూడా కారణం అయి ఉండవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్లో.

ప్రస్తుతం గోపీచంద్ చేతిలో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ బాలాజీ రియల్ మీడియా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఉంది. తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భూపతి దర్శకత్వం వహిస్తాడు. నిర్మాత కొన్ని రోజు క్రితం చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గోపీచంద్ ఇమేజ్‌కు తగినట్టుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాల మేళవింపుతో ఈ చిత్ర కథాంశం వుంటుంది. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తుంది. నిర్మాణపరంగా భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తాం. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: యం. రత్నం, సంగీతం: తమన్, కెమెరా: శక్తి శరవణన్.

jr.ntr-turns MLA-soon


ఎన్టీఆర్ కి 'ఎంఎల్.ఏ' పోస్ట్ ఖరారు


గత మూడేళ్లుగా ఎన్టీఆర్ ..'ఎంఎల్.ఏ'అవుతాడంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్క్రిప్టుకి ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందంటున్నారు. జూలై లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి 'షాక్' డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేయబోతున్న చిత్రం ఇది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి (ఎం)లక్షణాలు (ఎల్)ఎ(అబ్బాయి) అని వారి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు.

అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని న్యూస్. ఇక దమ్ము చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయేవి శ్రీను వైట్ల,హరీష్ శంకర్ చిత్రాలు మాత్రమే అని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందుతున్న దమ్ము చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

pawan-shankar-release-rachcha-audio


పవన్ కళ్యాణ్-డైరెక్టర్ శంకర్ జంటగా రచ్చ ఆడియో


మెగా వారసుడు రామ్ చరణ్ తేజ-తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘రచ్చ’ సినిమా ఆడియో ఫిబ్రవరి 26న కర్నూలులో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలోని ఎస్.టి.బి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ రచ్చ ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫంక్షన్ ప్రారంభం కానుంది. మణి శర్మ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించి ‘గ్యాంగ్ లీడర్’ 100 రోజుల వేడుక కర్నూలులోనే జరిగింది. మళ్లీ సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత మెగా కుటుంబానికి సంబంధించిన సినిమా వేడుక ఇక్కడ జరుగుతుండటంతో స్థానిక మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఒకే వేదికపై పవన్ స్టార్, డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ తేజ, తమన్నా లాంటి స్టార్లు వస్తుండటంతో అభిమానుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

ఈ చిత్రానికి సంబంధించిన సాంగు ఒకటి నెట్ లో ఇప్పటికే లీకైంది. "సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ...అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్ లో...బాలీవుడ్ లో'రాస్కెల్స్‌','ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్‌ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది.