Thursday, February 23, 2012

mahesh-babu-uses-beauty-secret


మహేష్ బాబు గ్లామర్ రహస్యం ఇదే...


సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. 40 సంవత్సరాల వయసుకు చేరువవుతున్నా...ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా నవనవలాడుతుంటారు. మహేష్ బాబు గ్లామర్‌కి ఎంతటి అందగత్తెలాంటి హీరోయిన్ అయినా దిగదుడుపే అని స్వయంగా పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. ఆయన గ్లామర్ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి చాలా మంది చాలా సార్లు ప్రత్నించారు కానీ వీలు కాలేదు. ఆయన గ్లామర్ కోసం స్కిన్ తెరపీ చేయించుకున్నారని, ప్రత్యేకంగా మందులు వాడుతారనే ప్రచారం కూడా ఉంది.

తాజాగా తన గ్లామర్ రహస్యం ఏమిటో స్వయంగా వెల్లడించాడు మహేష్ బాబు. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...ఇందులో దాచాల్సింది ఏమీ లేదని, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటే గ్లామర్ దానంతట అదే వస్తుందని చెప్పకొచ్చారు. వీలనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఇలా చేస్తే ఎవరైనా సరే ఆరోగ్యంగా, అందంగా ఉంటా మహేష్ బాబు చెప్పారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. దిల్ రాజు నిర్మాత.

nitin-about-his-film-ishq


నా ఆరోగ్యం సహకరించకపోయినా...నితిన్


అప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. అయినా... పట్టుబట్టి నాతో పాడించాడు. ఈ పాటకు లభించిన స్పందన చూశాక ఎంతో ఆనందం కలిగింది అంటున్నారు నితిన్. ఆయన తన తాజా చిత్రం ఇష్క్‌ లో ఓ పాట పాడారు. ఆ పాట గురించి మీడియా వారు అడిగితే ఇలా స్పందించారు. అలాగే...పాడటం నాకు అస్సలు రాదు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ బలవంతం చేయడంతో లచ్చువమ్మ... పాట పాడాను. కృష్ణచైతన్య ఆ పాట రాస్తున్నప్పుడు నేను కూడా పక్కనున్నాను. సరదాగా పాటని హమ్‌ చేస్తూ తిరుగుతున్నాను. అక్కడే ఉన్న అనూప్‌ రూబెన్స్‌ 'నువ్వు పాడుతుంటే బాగుంది. ప్రయత్నించొచ్చు కదా?' అన్నాడు.

ఇక వరస ప్లాప్ ల గురించి మాట్లాడుతూ...సినిమా జయాపజయాల వెనుక రకరకాల కారణాలుంటాయి. కానీ నేను పడే కష్టం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మంచి కథల్నే ఎంచుకొంటున్నాను. కానీ అవి చివరికి సరైన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. 'ఇష్క్‌' కోసం మరింత కసితో పనిచేశాను. ఈ సినిమా తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నా అన్నారు. ఇక హీరోలంతా స్పీడు పెంచారు. వరుసగా సినిమాలు చేయడం అందరికీ మంచిదే. ఇదివరకు నేనూ అలాగే చేశాను. కొన్ని రోజులుగా నా కెరీర్‌లో వేగం తగ్గిందంతే. మంచి కథలు దొరికితే నేనూ వరుసగా సినిమాలు చెయ్యాలనుకొంటున్నా అని చెప్పుకొచ్చారు. నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఇష్క్‌'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tuesday, February 21, 2012

Amala-paul-with-ram-charan


రామ్ చరణ్ సరసన...నాగచైతన్య హీరోయిన్

 

నాగచైతన్య సరసన బెజవాడ చిత్రంలో నటించిన అమలాపౌల్ కి తెలుగులో మరో ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వినాయిక్ ఆమె చిత్రాలు చూసి ఇంప్రెస్ అయ్యి మరీ ఆమెను తన చిత్రంలోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటున్నారో బాగా తెలిసిన దర్శకుడు వి.వి.వినాయక్‌. అటు మాస్‌నీ, ఇటు యువతనీ సమంగా మెప్పిస్తారు. పూర్తిస్థాయి మాస్‌ అంశాలున్న చిత్రమిది. నా పాత్ర భిన్న కోణాల్లో కనిపిస్తుంది. మగధీర తరవాత కాజల్‌తో చేస్తున్న చిత్రమిది. చక్కటి సంగీతం తోడైందని అన్నారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ..మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఇప్పుడు చిత్రిస్తున్న ఫైట్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌ పాతబస్తీలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

mahesh-babu-happy-mood


నేను చేసిన పొరపాట్ల వల్లే... మహేష్ బాబు


ఇప్పుడంటే ఓకేగానీ... ఒకప్పుడు నాలో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌ ఉండేది. 'రౌండప్‌ చేసి నన్ను కన్‌ఫ్యూజ్‌ చెయ్యొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అని బిజినెస్‌మేన్‌లో ఓ డైలాగ్‌. సినిమాల్లో నన్ను కన్‌ఫ్యూజ్‌చేసే, టెన్షన్‌పెట్టే విలన్లు ఉన్నారుగానీ... నిజజీవితంలో మాత్రం అలా ఎవ్వరూ లేరు. కన్‌ఫ్యూజనంతా నేను చేసిన పొరపాట్ల వల్లే. అది కూడా ఇప్పుడు పోయింది. క్లారిటీ వచ్చింది అంటున్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేష్ బాబు తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే...నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫేజ్‌ ఇది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అందుకు కారణం... దూకుడు, బిజినెస్‌మేన్‌ సినిమాలే. వాటి భారీ విజయాలు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. 'ఒక్కసారి కమిటయితే నామాట నేనే వినను' - 'పోకిరి'లోని ఈ డైలాగు నాకు చాలా బాగా సరిపోతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నానంటే దానికే కట్టుబడతాను. 'మనం చేసే పనివల్ల మనకు ప్రయోజనం ఉండాలి. ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు...' - ఇదీ నా ఫిలాసఫీ. దీన్నే ఫాలో అవుతాను అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో పాటు సుకుమార్ దర్సకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.

magadheera-scenes-rachcha


రచ్చలో మగధీర హైలెట్ సీన్


రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం మగధీర. ఆ చిత్రంలోని హైలెట్ సీన్ అయ్యిన వందమందిని నరికే సీన్ తరహా సన్నివేశం ఒకటి రచ్చలో రిపీట్ అవుతోందంటూ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే అవి రూమర్స్ అని కొట్టి పారేస్తున్నా... అలాంటి ఎమోషన్ ని రిపీట్ చేస్తూ అంతమందిని ఒక్కసారిగా హీరో ఎదుర్కొనే సన్నివేశం మాత్రం ఉందని చెప్పుకుంటున్నారు.

ఇక రచ్చలో యాక్షన్ సీన్సే హైలెట్ కానున్నాయని సమాచారం. రామ్ చరణ్,తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం రచ్చ. ఈ చిత్రంలో హీరో.. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కథే రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగాలి. ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌ రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

Allari-naresh-socio-fantasy-flick-from-mar-17


గ్రాఫిక్స్ హైలెట్ గా అల్లరి నరేష్ సినిమా


అల్లరి నరేష్ కథానాయకుడిగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మాత చంటి అడ్డాల ఓ సోషియో ఫాంటసీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వినోద భరిత చిత్రం షూటింగ్ మార్చి 17న ప్రారంభం కానుంది. నరేస్ కెరీర్లోనే తొలిసారి అత్యధిక బడ్జెట్ తో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ వర్క్ నిర్మాణానికి ముందు నుంచే మొదలు పెట్టామని ఆయన తెలిపారు. సాధారణంగా షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ పనులకు శ్రీకారం చుడతారని, అయితే ఈ చిత్రం కోసం తాము ముందే గ్రాఫిక్స్ పనులను ఆరంభించడం ఓ విశేషమని అన్నారు. అలానే భారీ సెట్స్ కూడా చిత్రానికి మరో ఆకర్షణ అవుతాయని, సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సుమన్, సురేష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, షియాజీ షిండే, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సత్తిబాబు

Its-just-kiss-kajal


‘మహేష్ కు, నాకు కామన్...ఎక్కువ చేయొద్దు’


బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పటి మహేష్ బాబు ఏ హీరోయిన్ తోనూ అంత ఘాటుగా, అంత రొమాంటిక్ గా ముద్దు పెట్టుకోలేదు. ఈ విషయాన్ని ఇటీవల మరోసారి కాజల్ వద్ద ప్రస్తావించగా ఇలా స్పందించింది. ‘‘మహేష్ బాబు, నేను ప్రొఫెషనల్ నటులం, మా ఇద్దరి మధ్య అది కేవలం సినిమా ముద్దు మాత్రమే, మా ప్రొఫెషన్లో ఇవన్నీ కామన్, సీన్ డిమాండ్ చేసింది కాబట్టే ఆ సీన్ ఉంది, అంతే కాని దీనిపై ఎక్కువ చేయొద్దు, టూమచ్ గా చూడొద్దు’’ అంటూ స్పందించింది.

బిజినెస్ మేన్ సినిమా తన కెరీర్ లో మరిచిపోలేని సినిమా, ఈ ప్రాజెక్టులో నాకు స్థానం కల్పించినందుకు మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కు చాలా థాంక్స్ అంటోంది ఈ భామ. ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని, మరిచిపోలేని మంచి అనుభూతి అని చెప్పుకొచ్చింది.

బిజినెస్ మేన్ సినిమా తర్వాత కాజల్ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ తో తీయబోయే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో మాట్రాన్, తుపాకి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్రితం సంవత్సరం వరస పరాజయాలతో పెయిల్యూర్ హీరోయిన్ గా ముద్రవేయించుకున్న ఈమె ఈ సంవత్సరం తనకు పూర్తిగా కలిసివస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది.