గ్రాఫిక్స్ హైలెట్ గా అల్లరి నరేష్ సినిమా
అల్లరి నరేష్ కథానాయకుడిగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మాత చంటి అడ్డాల ఓ సోషియో ఫాంటసీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వినోద భరిత చిత్రం షూటింగ్ మార్చి 17న ప్రారంభం కానుంది. నరేస్ కెరీర్లోనే తొలిసారి అత్యధిక బడ్జెట్ తో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ వర్క్ నిర్మాణానికి ముందు నుంచే మొదలు పెట్టామని ఆయన తెలిపారు. సాధారణంగా షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ పనులకు శ్రీకారం చుడతారని, అయితే ఈ చిత్రం కోసం తాము ముందే గ్రాఫిక్స్ పనులను ఆరంభించడం ఓ విశేషమని అన్నారు. అలానే భారీ సెట్స్ కూడా చిత్రానికి మరో ఆకర్షణ అవుతాయని, సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.
ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సుమన్, సురేష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, షియాజీ షిండే, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సత్తిబాబు

No comments:
Post a Comment