సోషియో ఫాంటసీలో అల్లరి నరేష్
గతంలో తనతో బెట్టింగ్ బంగార్రాజు చిత్రం రూపొందించిన ఇ.సత్తి బాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మార్చి 17న ప్రారంభం కానుంది. ఈ సినిమా వివరాలను నిర్మాత చంటి అడ్డాల వెల్లడిస్తూ -‘‘కొంత విరామం తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. నరేష్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ చిత్రం అవుతుంది. సాంకేతికంగా అద్భుతం అనిపించేలా ఉంటుంది. పూర్తి వినోదభరితంగా సత్తిబాబు ఈ చిత్రం రూపొందించనున్నారు. ఈ కథ విని నరేష్ ఎంతో థ్రిల్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేశారు. ఈ తరహా పాత్రలో నరేష్ నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమా కోసం ఎనిమిది భారీ సెట్స్ నిర్మించనున్నాం అన్నారు.
అలాగే ‘శ్రీరామరాజ్యం’ చిత్రానికి కళాదర్శకునిగా పనిచేసిన కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతుంది. కోటి సంగీతం అందిస్తారు. అలాగే కథ పరంగా గ్రాఫిక్స్‌కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో మేం చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చుతుందని మా నమ్మకం’’ అని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో సుమన్, నరేష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, సాయాజీషిండే, ఎమ్మెస్‌నారాయణ, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు ఇతర పాత్రధారులు. కెమెరా: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాణం: ఫ్రెండ్లీ మూవీస్.

No comments:
Post a Comment