Sunday, February 12, 2012

charmi-comments-on-ccl-matches


హీరోయిన్స్ క్రికెట్ ఆడటంపై చార్మి

"హీరోయిన్లు క్రికెట్ ఆడితే ప్రేక్షకులేం చూస్తారండీ.. పొడవాటి ప్యాంట్లు, టీ షర్ట్స్ వేసుకొంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అదే పొట్టి గౌన్లు వేసుకుని టెన్నిస్ ఆడితే ప్రేక్షకులతో స్టేడియం ఫుల్ అవుతుంది. అమ్మాయిల్ని అలాగైతేనే కదా ప్రేక్షకులు చూసేది'' అని చార్మి తేల్చి చెప్పింది.సీసీఎల్ మ్యాచ్‌ల్లో హీరోయిన్ చార్మి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెను మీడియావారు ...హీరోయిన్లు కూడా సీసీఎల్ మ్యాచ్‌లు ఆడవచ్చుకదా ..బాగా క్రేజ్ వస్తుంది కదా అని ప్రశ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ.. ఇక ఆమె స్టేడియంలో కూర్చుని...సిక్సర్ కొడితే కేరింతలు, వికెట్ పడితే హగ్గింగ్స్‌తో క్రికెట్ మైదానాన్నివేడిక్కించింది. ప్రస్తుతం జరుగుతున్న సీసీఎల్ రెండో సీజన్ మ్యాచుల్లో తెలుగు వారియర్స్ జట్టుకు ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇక సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) రెండో సీజన్లో తెలుగు వారియర్స్‌ కథ ముగిసింది. అజేయ జట్టుగా నాకౌట్‌కు చేరిన టాలీవుడ్‌ జట్టు.. సెమీస్‌లో బోల్తా కొట్టింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో వారియర్స్‌ చేతిలో ఎదురైన పరాజయానికి చెన్నై రైనోస్‌ ప్రతీకారం తీర్చుకుంది. సెమీఫైనల్లో వారియర్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది. శనివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో మొదట చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. తర్వాత వారియర్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేయగలిగింది.

No comments:

Post a Comment