Monday, February 13, 2012

jr.ntr dropped-the-channel idea


జూ.ఎన్టీఆర్ డ్రాప్ అయ్యారు


జూ.ఎన్టీఆర్ ఈ మధ్యన తమ స్టూడియో ఎన్ ఛానెల్ ని ఎక్సెటెండ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ని పెట్టాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడా ఐడియానుంచి ఆయన డ్రాప్ అయ్యినట్లు సమాచారం. ఎందుకంటే నెలకు యాభై లక్షలు నుంచి కోటి దాకా పెట్టుబడి పెట్టినా ఆ రేంజి రాబడి ఉండేటట్లు కనపడటం లేదని తేలటంతో ఈ నిర్ణయం మార్చుకున్నారని ఓ ఇంగ్లీష్ దినపత్రిక కథనం ప్రచురించింది. ఆయన టీమ్ డబ్బింగ్ సినిమాలను,స్ట్రైయిట్ సినిమాలను గత కొద్ది రోజులుగా శాటిలైట్ రైట్స్ ని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద సినిమాలను ఐదు కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టి తీసుకున్నారు.

మరో ప్రక్క తమ న్యూస్ ఛానెల్ పైన చాలా ఎఫెర్టు పెడుతున్నారు. అయితే ఇంత ఎఫెర్టు పెడుతున్నా వారి న్యూస్ ఛానెల్ రేటింగ్స్ కొద్దిగా కూడా పెరగక పోవటంతో ఈ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వద్దనే నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అయితే కొందరు అది నిజం కాదని ఖండిస్తూ..మేం కొన్ని ఫార్మాలిటీస్ వద్ద స్టక్ అయ్యాం...వాటిని పూర్తి చేసాక తప్పని సరిగా ఛానెల్ ని ట్రాక్ ఎక్కిస్తాం అని చెప్పారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ..దమ్ము చిత్రం చేస్తున్నారు. సింహా వంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంపై ఎన్టీఆర్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. త్రిష,కార్తీక కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

No comments:

Post a Comment