రజనీ, కమల్ కాంబినేషన్ పై అఫీషియల్ గా...
ఎప్పటినుంచో రజనీ,కమల్ కలిసి నటిస్తే మళ్లీ చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చినట్లుంది. కమల్ హాసన్ ఈ వివరాలను ముంబైకి చెందిన ఓ పత్రికతో మాట్లాడుతూ వివరించారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''రజనీకాంత్, నేను ప్రారంభం రోజుల్లో పది సినిమాలు దాకా కలిసి చేసాం. అయితే ఆ తర్వాత మేము కలిసి నటించేందుకు అనువైన కథ దొరక్క ఇన్నాళ్లూ నటించలేదు. అయితే దీనికి పరిష్కారం నేనే కనుక్కొన్నా. గతంలో నేను తీద్దామని ఆపిన 'మరుదనాయగమ్' చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ తెరకెక్కిద్దామనుకుంటున్నా. ఇందులో రజనీకి అనువైన పాత్ర ఉంది. అందులో ఆయన నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు.
1997లో 'మరుదనాయగమ్' చిత్రాన్ని కమల్ రూపొందించాలనుకున్నారు. అయితే బడ్జెట్ సమస్య కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ల్లో రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో ఉన్నారు కమల్. ఇక ఈ వార్త రజనీ,కమల్ అభిమానుల్లో ఆనందం నింపింది.

No comments:
Post a Comment