Friday, February 10, 2012

Ntr-dammu-audio-date-finalized


జూ ఎన్టీఆర్ దమ్ము ఆడియో తేదీ ఖరారు?

జూ ఎన్టీఆర్-త్రిష జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న దమ్ము చిత్రం ఆడియో ఉగాది సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి సినిమాకు పాటలు హైలెట్ గా నిలిచేలా ప్రత్యేకంగా ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. జూనియర్ సరసన త్రిష కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా...పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు.

యాక్షన్ అండ్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రేజీ హీరో ఎన్టీఆర్ కావడంతో దర్శకుడు బోయపాటి అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శద్ద తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు లీకైన దమ్ము డైలాగులకు అభిమానులను మంచి రెస్పాన్స్ వస్తోంది కూడా.

No comments:

Post a Comment