Tuesday, February 7, 2012

Pawan-kalyan-goes-paris

ప్యారిస్ వెళ్తున్న పవన్ కళ్యాణ్
 పవన్ కళ్యాణ్ త్వరలో ప్యారిస్ కి ప్రయాణం కట్టనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గబ్బర్‌సింగ్’ చిత్రం లో పాట కోసం ఈ టూర్ ప్లాన్ చేసారు. శృతిహాసన్ తో పవన్ ఈ పాటలో నర్తించనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేంకంగ వేసిన సెట్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక పవన్ ‘గబ్బర్‌సింగ్’లో ఓ ఢిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించి అలరించనున్నాడు. ఆ క్యారక్టైజేషన్ గురించి యూనిట్ వర్గాలు చెప్తూ...చేసే పోలీస్ ఉద్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఎదురున్న శత్రువుని కూడా తేలిగ్గానే తీసుకుంటాడు. లంచగొండి తనాన్నీ తేలిగ్గానే తీసుకుంటాడు. కావాలనుకుంటే తను కూడా లంచం తీసుకుంటాడు. కొట్టాలనిపిస్తే ఎవర్నయినా కొట్టేస్తాడు. మూడ్ లేకపోతే... ఎవర్నయినా వదిలేస్తాడు. కానీ అమ్మ, నాన్న, తమ్ముడు... ఇలాంటి సెంటిమెంట్లను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఇలాంటి డిఫరెంట్ కేరక్టరైజేషన్ పవన్ ఇంతకు ముందు చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ అబిమానులను ఆకట్టుకున్నది ఇది.

ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్ర ట్రైలర్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అరోజు పలు కొత్త చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో అదే రోజు ఈ ట్రైలర్లను థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 27న విడదల చేయనున్నారు.

No comments:

Post a Comment