లక్ష్యం లేని ఒక్కడు ('నిప్పు'ప్రివ్యూ)
విషయం: నారాయణమూర్తి (రాజేంద్రప్రసాద్)కి ముగ్గురు కూతుళ్లు. వారికి తగిన భర్తల్ని తీసుకురావాలనేది ఆయన ఆశ. మేఘన (దీక్షాసేథ్) ఓ అథ్లెట్. జాతీయస్థాయిలో పతకాలు సాధించాలనేది ఆమె లక్ష్యం. ఆధిపత్యపోరులో తనే విజేత కావాలని, గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనేది రాజాగౌడ్ (ప్రదీప్‌రావత్) ఆశయం. ఇలా ప్రతి ఒక్కరికీ ఓ లక్ష్యమంటూ ఉంది. ఒక్కరికి తప్ప... అతనే సూర్య (రవితేజ). లక్ష్యమంటూ లేకపోవడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యం.. అని నమ్మే వ్యక్తి అతను. నారాయణమూర్తి, మేఘన, రాజాగౌడ్.. వీరందరి ఆశలకు, ఆశయాలకూ సూర్యకూ సంబంధం ఏమిటి? మధ్యలో శ్రీరాం (శ్రీరాం) ఎవరు? ఈ విషయాలతో అల్లుకొన్నదే ఈ సినిమా.
ఈ చిత్రం గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ...తమ నిప్పు చిత్రం మాస్‌కోణంలో వినోదాత్మకంగా అందరినీ ఆకట్టుకునేవిధంగా ఆయన పాత్ర మలచబడిందని అన్నారు. లోగడ నా చిత్రాలు 'చూడాలనివుంది', 'ఒక్కడు' ఓవర్‌సీస్‌లో సంచలనం సృష్టించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా అక్కడి వారినందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే ..కథ, కథనాలే మా సినిమాకి ప్రధానబలం. ప్రతి పాత్రకూ ప్రాముఖ్యం ఉంది. రవితేజ నటన ఎప్పటిలా హుషారుగా ఉంటుంది. తమన్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. రాజేంద్రప్రసాద్ నటన అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రం ఓవర్‌సీస్ హక్కులను సుప్రీం మూవీస్ సొంతం చేసుకోగా, ఉత్తర అమెరికాలో ప్రణీత్ మీడియా చిత్రాన్ని విడుదల చేస్తోంది.
సంస్థ: బొమ్మరిల్లు
నటీనటులు: రవితేజ, దీక్షాసేథ్, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్, కృష్ణుడు, బ్రహ్మాజీ, సుప్రీత్, జయప్రకాష్ రెడ్డి, ప్రగతి తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: వై.వి.ఎస్.చౌదరి
దర్శకత్వం: గుణశేఖర్
విడుదల: 17.02.2011 శుక్రవారం.

No comments:
Post a Comment