Monday, February 13, 2012

satyanand-about-his-student-pawan-kalyan


పవన్ ఆ సమస్య నుంచి బయిటపడ్డాడు

పవన్ విషయానికి వస్తే అతనికి సిగ్గు, బిడియం బాగా ఎక్కువ. మొదట్లో కెమెరా ముందు నటించేందుకు చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు. అయితే పవన్ ఆ సమస్య నుంచి ట్రైనింగ్ సమయంలోనే బయిటపడ్డారు అంటున్నారు ట్రైనింగ్ ఇచ్చిన సత్యానంద్. వైజాగ్ ఉన్న ఆయన ఓ పత్రికకు ఇంటర్వూ ఇస్తూ ఇలా స్పందించారు.

ఆయన వద్ద మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రభాస్ గురించి చెపుతూ.. ప్రభాస్ కి స్వతహాగా లేడీస్ అంటే భయం..అతని బ్యాచ్ లో అమ్మాయిలు లేకపోవటంతో ఆ భయం అలాగే కొనసాగింది. అయితే నెమ్మిదిగా వదిలించాను. అలాగే ప్రభాస్ ట్రైనింగ్ కి వచ్చేటప్పుడు చాలా సన్నగా ఉన్నాడు. ఆ తర్వాత మీరే చూస్తున్నారుగా అని చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం ఆయన వైజాగ్ లోనే ఉండి ట్రైనింగ్ ఇస్తున్నారు. పబ్లిసిటీకి తాను దూరం అని..మౌత్ పబ్లిసిటీనే తనకు వర్కవుట్ అవుతోందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్..గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ఆ చిత్రం తర్వాత పూరీ జగన్నాధ్ తో కెమెరా మెన్ గంగ్ తో రాంబాబు చిత్రం చేయనున్నారు.

No comments:

Post a Comment