Wednesday, February 15, 2012

special-flashback-episode-rachcha


750 జూనియర్ ఆర్టిస్టులతో ‘రచ్చ’ఫ్లాష్ బ్యాక్ కేక..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాబోయే సినిమా ‘రచ్చ’లో కేక పుట్టించే విధంగా ఫ్లాష్ బ్యాక్ సీన్ ప్లాన్ చేశారు. 4 నిమిషాల పాటు సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఏకంగా 750కిపైగా జూనియర్ ఆర్టిస్టులు నటించనున్నారు. ఈ సీన్లో ప్రముఖ తమిళ డైరెక్టర్, నిర్మాత పార్థిబన్ తో పాటు నాజర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భారీ సన్నివేశ చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్, తమన్నా డాన్స్ అకాడమిలో డాన్స్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు తో ప్రారంభం అవుతుందని, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ పుడుతుందని తెలుస్తోంది.

సంపత్ నంది దర్శకత్వంలో రూపొందున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా అజ్మల్ అమీర్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా...లీసా హౌడెన్ ఐటం సాంగులో మెరవనుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

ఈచిత్రం తర్వాత రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభం అయింది. ఇందులో చెర్రీ సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment