సినిమాలు ఎందుకు ఒప్పుకుంటున్నానంటే..: నయనతార
నయనతార ఇక సినిమాలు చేయదు...‘శ్రీరామరాజ్యం’ చివరి సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె వరసగా తెలుగు,తమిళ భాషల్లో చిత్రాలు ఒప్పుకోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరికొంతమంది లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమెను మీడియాతో ... ‘ఇన్నాళ్లు ఒకరకమైన ఇబ్బందికర స్థితిలో నా జీవితం సాగింది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అందుకే సినిమాలు ఒప్పుకుంటున్నాను. తమిళ పరిశ్రమ నాకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది.
తెలుగు పరిశ్రమ దాన్ని రెట్టింపు చేసింది. అందుకే ఈ రెండు భాషల్లోనూ నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అని నర్మగర్భంగా అటూ ఇటూ కాకుండా సమాధానమిచ్చింది. ఆమె తాజాగా నాగార్జునతో సినిమా చేయడానికి అంగీకరించింది. దశరధ్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. అలాగే తమిళంలో అజిత్ సరసన ఓ చిత్రంలో నటించడానికి కమిటైందని తెలుస్తోంది. తెలుగులో పంజా చిత్రం డైరక్ట్ చేసిన విష్ణువర్థన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. గతంలో అజిత్ సరసన బిల్లా, ఏగన్ చిత్రాల్లో నటించారామె.

No comments:
Post a Comment