Sunday, February 12, 2012

About sunil -poola-rangadu-story-line


సునీల్ 'పూలరంగడు' స్టోరీ లైన్ ఏమిటి

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కోట్లు సంపాదించి కోటలు కట్టేద్దాం అనుకుంటాడు రంగా. కాలం కలిసి రాలేదు. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో ఓ అందాల భామ వలపు వల విసురుతుంది. ఆ తరవాత జరిగిన పరిణామాలేమిటి? అన్నదే పూలరంగడు కాన్సెప్టు అంటున్నారు నిర్మాత కె అచ్చిరెడ్డి. ఆయన నిర్మించిన చిత్రం 'పూలరంగడు'ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో సునీల్‌, ఇషాచావ్లా జంటగా నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి మాట్లాడుతూ ...సునీల్‌ - ఇషాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. దీంట్లో సునీల్‌ సిక్స్ పాక్ తో కనిపిస్తారు. ఆయన చేసే ఫైట్స్ ఉత్కంఠ రేకెత్తిస్తాయని అన్నారు. ఇక కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్‌, రఘుబాబు, దేవ్‌గిల్‌, పృధ్వీ, సుధ, ప్రగతి తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌.

No comments:

Post a Comment