ఆ తమిళ రీమేక్ లో నాగచైతన్య?
నాగచైతన్య త్వరలో ఓ తమిళ రీమేక్ లో చేయబోతున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తమిళంలో ఈ మధ్యనే విడుదలై మంచి హిట్టైన మౌనగురు చిత్రం తెలుగులో ఓ పెద్ద బ్యానర్ చెయ్యటానికి ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. దానికి ఓ యంగ్ డైరక్టర్ తెలుగు నేటివిటీ అద్ది మరీ కథనం వినిపించాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 16,2011 న పెద్ద పబ్లిసిటీ లేకుండా విడుదలైంది. కాలేజీ యూత్ ఎలా అండర్ వరల్డ్ మాఫియాలోకి వెల్తున్నారో ఈ సినిమా చెపుతుంది. క్రైమ్ ప్లాట్ తో నడిచే ఈ చిత్రం అక్కడ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
ఎస్.ఎస్ .ధమన్ సంగీతం అందించిన ఈ చిత్రం అక్కడ హిట్ గా డిక్లేర్ అయ్యింది. అలాగే ఈ యాక్షన్ చిత్రం కూడా కావటంతో నాగచైతన్యకు బాగా నచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య...దేవకట్టా దరకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆటో నగర్ సూర్య టైటిల్ తో రూపొందే ఆ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సమంత ఆ చిత్రంలో మాస్ కు నచ్చే రోల్ లో కనిపించనుంది. ఆర్.ఆర్.మూవి మేకర్స్ వారు ఆ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

No comments:
Post a Comment