ఆ కిక్కుంటే గ్యారెంటీ హిట్:అల్లు అర్జున్
సినిమా అంటే అందులో కిక్ ఉండాలి. ఆ కిక్కుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అంటున్నారు అల్లు అర్జున్. ఆయన ‘ఈరోజుల్లో’ చిత్రం ఆడియో ఆవిష్కరణకు హాజరయ్యారు. గుడ్ సినిమా గ్రూప్ అండ్ మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఈరోజుల్లో’. అల్లు అర్జున్ ఆడియోను ఆవిష్కరించి అల్లు అరవింద్‌కి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే..ఈ సినిమాలో ఆ కిక్కు ఉందని నా ఫీలింగ్. అయినా చిన్న సినిమా చిన్న సినిమా అంటుంటారు. నా దృష్టిలో మంచి సినిమా పెద్ద సినిమా. బాగాలేని పెద్ద సినిమా చిన్న సినిమా. మ్యూజిక్ సూపర్‌గా ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసినదానికంటే బాగుంది. నా ఫ్రెండ్ మారుతి కింద స్థాయి నుంచి ఎదిగి, ఇంత దూరం వచ్చాడు. ఇంకా ఎంతో దూరం వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇక అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...‘‘బన్నీకి మారుతి చిన్ననాటి స్నేహితుడు. ఒక మంచి దర్శకుడవుతాడని అప్పుడే అనుకున్నా. తను మల్టీ టాలెంటెడ్. తప్పకుండా మంచి దర్శకుడిగా ఎదుగుతాడని నా నమ్మకం’’ అని చెప్పారు. రేష్మా, సాయి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూర్: యం.శివరామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్.శ్రీ.

No comments:
Post a Comment