Friday, February 10, 2012

Susarla-dakshina-murthy-passed-away


సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి మృతి


ప్రముఖ సంగీత దర్శకులు సుచర్ల దక్షిణామూర్తి(90)గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దక్షిణామూర్తి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నేపథ్య గాయకుడిగా కూడా పలు పాటలు పాడారు. నారద నారది చిత్రంతో ఆయన సంగీత దర్శకుడిగా మారారు. సుమారు 135 చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు. నిర్మాతగా మోహినీ రుక్మాంగద, రమా సుందరి చిత్రాలను నిర్మించారు. ఇక దక్షిణామూర్తి స్వస్థలం కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి. సంగీత కుటుంబ నేపథ్యం కావడంతో పదమూడేళ్ల వయసులోనే వయోలిన్‌తో అనేక కచేరీలు ఇచ్చారు.

ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు వద్ద సహాయకుని తొలుత పనిచేశారు. అనంతరం ఆకాశావాణిలో కొంతకాలం విధులు నిర్వహించారు. సినీ సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ దగ్గర సహాయకుడి చేరి తన సినీ సంగీత జీవితాన్ని ప్రారంభించారు. చెంచులక్ష్మి, స్వప్నసుందరి, అక్కినేని 'దేవదాసు' చిత్రాలకు సుబ్బురామన్‌ వద్ద పనిచేశారు. ఆయన సంగీతం అందించిన చిత్రాల్లో.. సంసారం,ఇలవేలుపు, అన్నపూర్ణ, కృష్ణ లీలలు, శ్రీమద్ విరాట్ పర్వం, నర్తనశాల, శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వంటివి పెద్ద మ్యూజికల్ హిట్స్. అవి ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.

No comments:

Post a Comment