ఆర్యన్ రాజేష్ వివాహం-పిపిగా అల్లరి నరేష్
ప్రముఖ దర్శకుడు దివంగత ఇవివి సత్యనారాయణ కుమారుడు, సినీ నటుడు ఆర్య రాజేష్ వివాహం శుక్రవారం రాత్రి(శనివారం తెల్లవారు ఝామున గం. 4.20ని) జరుగనుంది. కడియం మండలం జేగురుపాడుకి చెందిన కాంట్రాక్టర్ కంటిపూడి అమర్‌నాథ్ కుమార్తె సుభాషిణితో ఆర్యన్ రాజేష్ వివాహం జరుగనుంది. వివాహ వేదికను కలకత్తా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ లు అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం గోదావరి జిల్లాల స్పెషల్ వంటకాలను రెడీ చేస్తున్నారు.
ఈ వేడుకకు తెలుగు సినీ ప్రముఖులతో పాటు హిందీ, తమిళం, కన్నడ సినీ నటులు హాజరు కానున్నారు. పెళ్లి వ్యవహారాలన్నీ రాజేష్ తమ్ముడు అల్లరి నరేష్ దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజేష్ తర్వాత ఇంటి పెద్ద కూడా అతడే కాబట్టి రెస్పాన్సిబుల్ పిపి(పెళ్లి పెద్ద)గా వ్యవహరిస్తున్నారు.

No comments:
Post a Comment