Saturday, February 11, 2012

subbaraju movie in march as hero


సుబ్బరాజు హీరోగా ‘జయహే’ మార్చిలో

హీరో పర్సనాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా ఉండే నటుడు సుబ్బరాజు. ఇంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో కనిపించిన సుబ్బరాజు త్వరలో ‘జయహే’ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుధీర్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుదీప్, రామకృష్ణ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సుబ్బరాజు ఈ చిత్రంలో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బ్రహ్మాజీ, శివాజీరాజా, ఎంఎస్ నారాయణ, జీవా, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిన్ని చరణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయభాస్కర్ చౌదరి లియో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: వెంకట్, ఎడిటింగ్: నందమూరి హరి

ఈ చిత్రంతో పాటు ‘అజ్ఞాతం’ అనే చిత్రంలోనూ సుబ్బరాజు హీరోగా నటిస్తున్నాడు. పోకూరు సుధీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.వి.ఎస్. రావు శ్రీకామాలయ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీప్తి ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

No comments:

Post a Comment