Saturday, February 11, 2012

Balakrishnas-new-film-title-sreemannarayana

బాలయ్య కొత్త సినిమా ‘శ్రీమన్నారాయణ’
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీమన్నారాయణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను మీరోయిన్లుగా ఎంపిక చేశారు.

మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ‘సింహా’ సినిమాలో మాదిరిగా లెక్చరర్ పాత్ర పోషిస్తున్నారని, అభిమానులు మెచ్చే పూర్తి వినోదాత్మక యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లుతో గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట.

ప్రస్తుతం బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలో ‘అధినాయకుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటిస్తున్నారు. ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment