Saturday, February 11, 2012

Mahesh-babu-cell-phone-secrets


హీరో మహేష్ బాబుకు ఫోన్ చేయాలంటే...

టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు లైఫ్ స్టైల్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలు, ఇల్లు తప్ప ఈ హీరోకి మరో లోకం తెలియదు. బయటి దేశాలకు విహారానికి వెళ్లినా విత్ ఫ్యామిలీతోనే. తన దైన మ్యానరిజంతో అభిమానులను ఆకట్టుకుంటూ టాప్ హీరో రేంజ్‌కి ఎదిగాడు.

ప్రస్తుతం పలు కార్పొరేట్ కంపెనీలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు మహేష్ బాబు. ముఖ్యంగా అందులో చెప్పుకోదగ్గది ఐడియా 3జి. ఈ నెట్వర్క్ కనెక్షన్ వాడండి అంటూ మహేష్ చేస్తున్న ప్రచారమే కాబోలు ఐడియా సేల్స్ బాగా పెరిగాయి. అయితే మహేష్ బాబు సెల్ ఫోన్ వాడతారా? వాడితే ఆయన నెంబర్ ఏమిటో? అనే సందేహాలు ఇప్పటికే చాలా మందికి వచ్చాయి. వీటన్నింటికీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు మహేష్ బాబు.

తాను సెల్ ఫోన్ వాడటాన్ని ఇష్ట పడనని, వీలైనంత వరకు దానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. మరి మిమ్మల్ని కాంటాక్టు చేయడం ఎలా అంటే..? ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్ ఎలాగూ ఉంటుంది. బయట ఉన్నప్పుడు తన పర్సనల్ అసిస్టెంట్(పిఏ) లేదా మేకప్ మ్యాన్ ఉపయోగించే సెల్ ఫోన్ ద్వారా మాత్రమే మహేష్ బాబును కాంటాక్టు చేయడం వీలవుతుందట. సో..అభిమానులు మీరు మహేష్ బాబుతో మాట్లాడాలనుకుంటే ఆయన పీఏ లేదా మేకప్ మేన్ సెల్ ఫోన్ నెంబర్ పట్టుకోవాలన్నమాట.

No comments:

Post a Comment