Sunday, February 12, 2012

cameraman-ganga-tho-rambabu-trendinding


పవన్ కళ్యాణ్ ఎవరు? పూరి కన్‌ఫ్యూజన్!

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ కూడా నిన్న ఖరారు చేశాడు. టైటిల్ బాగానే ఉందికానీ దీన్ని చూసి అభిమానులు కన్ ఫ్యూజ్ అవుతున్నాడు. పూరి జగన్నాథ్ టైటిల్‌కు సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వక పోవడమే ఇందుకు కారణం.

టైటిల్‌లో రెండు పేర్లు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఒకటి కెమెరామెన్ గంగ, మరొకరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయన ఏపాత్ర పోషిస్తున్నారు? కెమెరామెన్ గంగ పాత్రా? లేక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు పాత్రా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై పూరి జగన్నాథ్ ఎప్పుడు వివరణ ఇస్తారో ఏమిటో..?

ఇంటర్నెట్ లో మాత్రం ఈ సినిమా వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆరాట పడుతున్నారు. పవన్ కళ్యాన్ రాంబాబు, పవన్ కళ్యాణ్ కెమెరామెన్, పవన్ కళ్యాణ్ గంగ అనే కీవర్డ్స్ ఉపయోగిస్తూ గూగుల్, యాహూ సెర్చ్ ఇంజన్లలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది

No comments:

Post a Comment