16న జాయిన్ కాబోతున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నాడు. జవవరి 18నే మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయి పూర్తయింది. వైజాగ్ పరిసరాల్లో షూటింగ్ జరిపారు. ఈ చిత్రం సెంకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 16 నుంచి తమిళనాడులో జరుగనుంది. మహేష్ బాబు కూడా అదే రోజు SVSC టీంలో జాయిన్ కాబోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సెకండ్ షెడ్యూల్ పూర్తి కానుంది. అనంతరం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఓ టీవీ కమర్షియల్ యాడ్ కోసం బ్యాంకాక్ వెళ్లాడు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్లు నటిస్తున్నారు. శ్వేత బసు ప్రసాద్ ఈ ఇద్దరు హీరోల ముద్దుల చెల్లెలుగా, అమల పాల్ మరదలి పాత్రలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత మహాష్ బాబు ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం గురించి మహేష్ బాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.....‘‘నా రాబోయే చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవుతా. వెంకటేష్‌లాంటి సీనియర్ నటుడినుండి నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

No comments:
Post a Comment