సినిమారంగంలో రవితేజ ఫైర్
'క్రీడారంగంలో ఫైర్ సచిన్ అయితే, సినిమారంగంలో ఫైర్ రవితేజ అంటున్నారు దర్శకుడు గుణశేఖర్. రవితేజ హీరోగా దర్శకుడు గుణశేఖర్‌ల రూపొందిస్తున్న చిత్రం 'నిప్పు'. బొమ్మరిల్లు వారి పతాకంపై వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న 'నిప్పు' చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది . ఈ చిత్రం ఓవర్‌సీస్ హక్కులను సుప్రీం మూవీస్ సొంతం చేసుకోగా, ఉత్తర అమెరికాలో ప్రణీత్ మీడియా చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓవర్‌సీస్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే..తమ నిప్పు చిత్రం మాస్‌కోణంలో వినోదాత్మకంగా అందరినీ ఆకట్టుకునేవిధంగా ఆయన పాత్ర మలచబడిందని అన్నారు. లోగడ నా చిత్రాలు 'చూడాలనివుంది', 'ఒక్కడు' ఓవర్‌సీస్‌లో సంచలనం సృష్టించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా అక్కడి వారినందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు. హీరో రవితేజ మాట్లాడుతూ, 'మా ముగ్గురి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందన్న నమ్మకం ఉంది. ఆడియో కూడా విజయం సాధించడం ఆనందంగా ఉంది' అని అన్నారు. అనంతరం నిర్మాత వై.వి.యస్.చౌదరి మాట్లాడుతూ, 'విదేశాలలోని తెలుగువారు మన చిత్రాలను అధికంగా చూస్తున్నారు. అక్కడివారి కోసం రూపొందించిన వాల్‌పోస్టర్ ఇది. పరిశ్రమలో దీనికి మేమే శ్రీకారం చుట్టాం. ఇదే చిత్రం కోసం డిజిటల్ వాల్‌పోస్టర్‌ను మొదటిసారిగా మేమే ముద్రించాం' అని అన్నారు.

No comments:
Post a Comment