చిరు వద్దన్నారనే ఆగా:రాజశేఖర్
చిరంజీవి,రాజశేఖర్ ల మధ్య విరోధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో చెయ్యాల్సింది. ఈ విషయాన్ని రాజశేఖర్ గుర్తు చేస్తూ...'స్నేహం కోసం'లో విజయ్‌కుమార్ చేసిన పాత్ర నేను పోషించాల్సింది. వయసు రీత్యా పెద్ద పాత్ర అవుతుందనే ఉద్దేశంతో చిరంజీవి వద్దన్నారు. లేకపోతే మా కాంబినేషన్ లో సినిమా వచ్చేది అన్నారు. అలాగే నాకు మల్టీస్టారర్ చిత్రాలు చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. నేనూ నాగార్జున కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మనమిద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని బాలకృష్ణ కూడా ఓ సారి అడిగారు. కథ నచ్చితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇటీవలే గెస్ట్‌రోల్ ఒకరు అడిగారు. కోటి రూపాయలు ఆఫర్ చేశారు. పారితోషికం బాగుందనిపించింది. అయితే పాత్ర నచ్చితేనని షరతు పెట్టాను. పెదారయుడులో రజనీకాంత్ తరహా పాత్ర అన్నారు. అవి విన్నాక నిర్ణయం చెబుతాను అన్నారు.

No comments:
Post a Comment