సిక్స్ ప్యాక్ పై మహేష్ బాబు కామెంట్
సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నించాను. ముఖం అదోలా తయారైంది. ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టేశాను. ఫ్యూచర్‌లో ట్రై చేస్తానేమో అన్నారు మహేష్ బాబు. ఆయన్ని మీడియా వారు సిక్స్ ప్యాక్ చేయబోతున్నారని విన్నాము అంటే దానికి అలా స్పందించారు. అలాగే రకరకాల విషయాలపై తన అభిప్రాయాలు చెప్తూ...నేను ఇక్కడ థియేటర్లలో సినిమా చూడను. సినిమాలు చూడటానికి ముంబై వెళ్తాను. నాకు నచ్చిన సినిమాలన్నీ... ఒక సామాన్య ప్రేక్షకుడిలా చూసి ఎంజాయ్ చేస్తాను. అలాగే నేను ఇష్టపడే, సినిమా చేయాలనుకునే దర్శకుల్లో మొదటివ్యక్తి మణిరత్నం. అలాగని నాకు రీమేక్‌లు నచ్చవు అన్నారు.
ఇక సినిమాల్లో ఇన్వాల్వమెంట్ గురించి మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన చర్చల్లోగానీ సెట్స్‌లోగానీ... నేను నా క్యారెక్టర్ ఒక్కటే చూసుకుంటాను. మిగతా విషయాల్లో తలదూర్చను అని తేల్చి చెప్పారు. అలాగే నేను గతాన్ని పట్టించుకోను. వర్తమానంలో బతకడానికే ఇష్టపడతాను. దేవుణ్ణి నమ్ముతాను. పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాను. తిరుపతి వెంకటేశ్వరస్వామిని ఎక్కువగా దర్శించుకుంటాను. మన దేవాలయాలూ పుణ్యక్షేత్రాల్లో ఏదో మహత్తు ఉంది. అక్కడకు వెళ్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే త్వరలో సుకుమార్ దర్సకత్వంలో రూపొందే చిత్రం కూడా షూటింగ్ ప్రారంభం కానుంది.

No comments:
Post a Comment