నేను చేసిన పొరపాట్ల వల్లే... మహేష్ బాబు
ఇప్పుడంటే ఓకేగానీ... ఒకప్పుడు నాలో కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉండేది. 'రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అని బిజినెస్‌మేన్‌లో ఓ డైలాగ్. సినిమాల్లో నన్ను కన్‌ఫ్యూజ్‌చేసే, టెన్షన్‌పెట్టే విలన్లు ఉన్నారుగానీ... నిజజీవితంలో మాత్రం అలా ఎవ్వరూ లేరు. కన్‌ఫ్యూజనంతా నేను చేసిన పొరపాట్ల వల్లే. అది కూడా ఇప్పుడు పోయింది. క్లారిటీ వచ్చింది అంటున్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేష్ బాబు తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే...నా కెరీర్‌లోనే బెస్ట్ ఫేజ్ ఇది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అందుకు కారణం... దూకుడు, బిజినెస్‌మేన్ సినిమాలే. వాటి భారీ విజయాలు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. 'ఒక్కసారి కమిటయితే నామాట నేనే వినను' - 'పోకిరి'లోని ఈ డైలాగు నాకు చాలా బాగా సరిపోతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నానంటే దానికే కట్టుబడతాను. 'మనం చేసే పనివల్ల మనకు ప్రయోజనం ఉండాలి. ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు...' - ఇదీ నా ఫిలాసఫీ. దీన్నే ఫాలో అవుతాను అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో పాటు సుకుమార్ దర్సకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.

No comments:
Post a Comment