రామ్ చరణ్ సరసన...నాగచైతన్య హీరోయిన్
నాగచైతన్య సరసన బెజవాడ చిత్రంలో నటించిన అమలాపౌల్ కి తెలుగులో మరో ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వినాయిక్ ఆమె చిత్రాలు చూసి ఇంప్రెస్ అయ్యి మరీ ఆమెను తన చిత్రంలోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటున్నారో బాగా తెలిసిన దర్శకుడు వి.వి.వినాయక్. అటు మాస్‌నీ, ఇటు యువతనీ సమంగా మెప్పిస్తారు. పూర్తిస్థాయి మాస్ అంశాలున్న చిత్రమిది. నా పాత్ర భిన్న కోణాల్లో కనిపిస్తుంది. మగధీర తరవాత కాజల్‌తో చేస్తున్న చిత్రమిది. చక్కటి సంగీతం తోడైందని అన్నారు.
వివి వినాయిక్ మాట్లాడుతూ..మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఇప్పుడు చిత్రిస్తున్న ఫైట్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

No comments:
Post a Comment