Wednesday, February 8, 2012

Maintenance-petition-filed-against-prabhu-deva-father

ప్రభుదేవా తండ్రి రహస్య వివాహం గుట్టు రట్టు... కేసు
స్టార్ డాన్స్ డైరక్టర్ ప్రభుదేవా తండ్రి... ప్రముఖ నృత్య దర్శకుడు సుందరం అనే సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఓ కోర్టు కేసులో ఇరుక్కున్నారు. ఆయన ప్రముఖ నృత్య దర్శకురాలు తారను రహస్య వివాహం చేసుకున్న విషయం గుట్టు రట్టైంది. ఆమె ఆయన నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేస్తున్నప్పుడు సుందరం దగ్గర ఆమె సహాయకురాలిగా వ్యవహరించేవారు.

తార దాఖలు చేసిన పిటిషన్‌లో ''1964-72 మధ్య సుందరం నాతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన దగ్గర నేను సహాయకురాలిగా వ్యవహరించా. మాకు 1970లో వివాహం జరిగింది. ఏడాది తరవాత ఓ బాబు జన్మించాడు. ఇందుకు ఆ శిశువు జనన, పాఠశాల ధ్రువీకరణ పత్రాలే సాక్ష్యం. తరవాత నుంచీ ఆయన నాకు దూరమవుతూ వచ్చారు. వివాహం గురించి బయట ఎక్కడా చెప్పొద్దని కూడా హెచ్చరించారు. తరవాత రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ.వంద కోట్లు. గతంలో నన్ను ఇబ్బంది పెట్టినందుకు రూ.ఐదు కోట్లు, భవిష్యత్తులో ప్రతి నెలా రూ.75 వేల చొప్పున భరణం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయమని పేర్కొన్నారు.

ఇక ప్రభుదేవా కూడా నయనతారతో రెండవ వివాహం నిమిత్తం మొదటి భార్య రమకు కోర్టు ద్వారా విడాకులు తెచ్చుకుని భరణంకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సుందరం మాస్టార్ గా పిలవబడే సుందరం కు ముగ్గురు కుమారులు. వాళ్లు ప్రభుదేవా,రాజు సుందరం,నాగేంద్రప్రసాద్. వీరు ముగ్గరూ కొరియోగ్రాఫర్స్ గా ఎదిగారు. ప్రస్తుతం సుందరం ఎక్కువగా టీవీ డాన్స్ పోగ్రాములకు జడ్జిగా వెళ్తున్నారు

No comments:

Post a Comment