Wednesday, February 8, 2012

Nagarjuna-expands-business

వ్యాపార విస్తరణలో నాగార్జున బిజీ
నాగార్జున మంచి నటుడుగానే కాక అంతకుమించి మంచి బిజినెస్ మ్యాన్ గా అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం తమ అన్నపూర్ణ స్టూడియో ఆధునీకరణపై ఉంది. ఆ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. స్టూడియోలో అత్యానికి టెక్నాలిజీ, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీలపై ఆయన దృష్టి పెట్టారు. అందులో భాగంగా సౌండ్ మిక్సింగ్ యూనిట్స్, ఎడిట్ సూట్స్ , డిటిఎస్ ల్యాబ్ ఫెసిలిటీస్ ని అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు త్రీడి సినిమాలకు కూడా మార్కెట్ పెరగటంతో విజువల్ ఎఫెక్టులకు సంభందించిన టెక్నాలిజీ కోసం రిలియన్స్ మీడియాతో టై అప్ అవుతున్నట్లు సమచారం. ముంబైలో జరిగే సినిమా పనులుకు ధీటుగా హైదరాబాద్ లోకూడా జరగాలన్నది ఆయన కోరిక అని అంటున్నారు.

ఆయన నిజానికి తన బిజినెస్ విస్తరించుకోవటానికి చేస్తున్నా..ఇండస్ట్రీకి కూడా ఎంతో మేలు చేసినట్లు అవుతుందని సీనియర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున .. ఢమురకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.

No comments:

Post a Comment