Sunday, February 12, 2012

The-money-is-legally-ileanas


చట్టబద్దంగా ఆ డబ్బు ఇలియానాకే...

తమిళ ప్రొడ్యూసర్ మోహన్ నటరాజన్ హీరోయిన్ ఇలియానాపై ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన సినిమాలో నటించేందుకు రూ. 40 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న ఇలియానా డేట్స్ ఇవ్వకుండా, అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని, వెంటనే తనకు రావాల్సిన డబ్బు ఇప్పించాలని ఆ నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇలియానా తరుపు అధికార ప్రతినిధి మాత్రం డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. కాంట్రాక్టు ప్రకారం చట్టబద్దంగా ఆ డబ్బు ఇలియానాకే చెందుతుందని, డబ్బు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారట.

గతంలో ఇలియానా తెలుగులో జూఎన్టీఆర్ సరసన శక్తి సినిమాలో నటించింది. ఆ సమయంలో నిర్మాత అశ్వనీదత్ ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్లో పాల్గొనడానికి డేట్స్ కేటాయించక పోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ఇలియానా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో బర్ఫీ, వన్స్ అపానె టైమ్ ముంబై2, కిలాడీ 786 చిత్రాల్లో నటిస్తోంది.

No comments:

Post a Comment