Sunday, February 12, 2012

sneha-walks-of-rajinikanths-film


రజనీకాంత్ సినిమా నుంచి స్నేహా ఔట్

రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన తనయ సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చాడయాన్ 3డి’ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో రజనీ చెల్లెలిగా నటించడానికి స్నేహను ఎంపికచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందిన ప్రకారం డేట్స్ అడ్జెస్ట్ మెంట్స్ కాక పోవడం కారణంగా స్నేహ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆమె స్థానంలో తమిళ నటి రుక్మిణిని ఎంపిక చేశారు. ఈ చిత్రంలో రజనీ సరసన దీపిక పడుకొనె ఖరారైంది. ఆమెతో పాటు తెలుగు నటుడు ఆది, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇతర పాత్రలకు ఎంపికయ్యారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

‘అవతార్’ సినిమా తరహాలో పెర్‌ఫ్మాన్స్ క్యాప్చరింగ్ పద్దతిలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సౌందర్యకు దర్శకత్వం కొత్త కావడంతో కె.ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో ఆమె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి కథను కూడా కె.ఎస్. రవికుమారే అందించారు. ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు.

No comments:

Post a Comment