Monday, February 6, 2012

nagarjuna-shirdi-sai-film-rolls

కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘షిరిడి సాయి’ అనే ఆధ్యాత్మిక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నాటక రాష్ట్రంలోని బదామి ప్రాంతంలో జరుగుతోంది. ఫిబ్రవరి 20 వరకు ఇదే ప్రాంతంలో షూటింగ్ జరుగనుంది.

నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ‘షిరిడి సాయి’ చిత్రంపై కూడా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన నాగార్జున షిరిడి సాయి గెటప్ అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథ సమకూర్చగా.... సాయికృపా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా వేద వ్యాస్, చంద్రబోస్ లిరిక్ రైటర్స్‌గా పని చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటల అందిస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం.

No comments:

Post a Comment