Monday, February 6, 2012

sirish-wants-do-15-tamil-films

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తర్వలో హీరోగా తెరంగ్రేటం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగువాడైన శిరీష్ తన తొలి సినిమా తెలుగులో కాకుండా తమిళంలో చేస్తున్నాడు. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్‌ఫెక్ట్ తమిళ రీమేక్‌లో శిరీష్ నటిస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక అయినా అతడు తెలుగులో హీరోగా పరిచయం అవుతాడని ఊహించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సినిమాలు తమిళంలో చేసిన తర్వాతే తెలుగులో శిరీష్ ఎంట్రీ ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే వెల్లడించారు.

ఎందుకలా...? అంటే ఏమో నాకే తెలియడం లేదు, వాడి నిర్ణయం ఇప్పటికీ మిలియన్ డాలర్ల పశ్నగానే ఉంది అంటూ సమాధానం ఇచ్చారు అరవింద్. అయితే శిరీష్ నిర్ణయం వెనక ఉన్న అసలు కారణం వేరే ఉందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈ తరుణంలో తాను ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయితే భవిష్యత్ భయంకరంగా ఉంటుందని, పరిశ్రమలోని ఇతర కుటుంబాల ప్లాపు వారసుల లిస్టులో చేరిపోతానని శిరీష్ భయ పడుతున్నాడని అంటున్నారు.

తమిళంలో ఓ 15 సినిమాలు చేస్తే బాగా అనుభవం వస్తుందని, అక్కడ సక్సెస్ ఫుల్ స్టార్ గా పేరు తెచ్చుకుంటే ఇక్కడ సినిమాల్లో దర్జాగా అడుగు పెట్టవచ్చని, కెరీర్ కూడా బాగుంటుందనేది శిరీష్ ఆలోచనగా కనిపిస్తోందని మరికొందరు అభిప్రాయం పడుతున్నారు. మరి శిరీష్ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment