నా ఆరోగ్యం సహకరించకపోయినా...నితిన్
అప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. అయినా... పట్టుబట్టి నాతో పాడించాడు. ఈ పాటకు లభించిన స్పందన చూశాక ఎంతో ఆనందం కలిగింది అంటున్నారు నితిన్. ఆయన తన తాజా చిత్రం ఇష్క్ లో ఓ పాట పాడారు. ఆ పాట గురించి మీడియా వారు అడిగితే ఇలా స్పందించారు. అలాగే...పాడటం నాకు అస్సలు రాదు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బలవంతం చేయడంతో లచ్చువమ్మ... పాట పాడాను. కృష్ణచైతన్య ఆ పాట రాస్తున్నప్పుడు నేను కూడా పక్కనున్నాను. సరదాగా పాటని హమ్ చేస్తూ తిరుగుతున్నాను. అక్కడే ఉన్న అనూప్ రూబెన్స్ 'నువ్వు పాడుతుంటే బాగుంది. ప్రయత్నించొచ్చు కదా?' అన్నాడు.
ఇక వరస ప్లాప్ ల గురించి మాట్లాడుతూ...సినిమా జయాపజయాల వెనుక రకరకాల కారణాలుంటాయి. కానీ నేను పడే కష్టం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మంచి కథల్నే ఎంచుకొంటున్నాను. కానీ అవి చివరికి సరైన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. 'ఇష్క్' కోసం మరింత కసితో పనిచేశాను. ఈ సినిమా తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నా అన్నారు. ఇక హీరోలంతా స్పీడు పెంచారు. వరుసగా సినిమాలు చేయడం అందరికీ మంచిదే. ఇదివరకు నేనూ అలాగే చేశాను. కొన్ని రోజులుగా నా కెరీర్‌లో వేగం తగ్గిందంతే. మంచి కథలు దొరికితే నేనూ వరుసగా సినిమాలు చెయ్యాలనుకొంటున్నా అని చెప్పుకొచ్చారు. నితిన్ హీరోగా నటించిన చిత్రం 'ఇష్క్'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

No comments:
Post a Comment