Friday, February 10, 2012

Paruchuri-murali-about-balakrishna


బాలకృష్ణకు జీవితాంతం రుణపడి ఉంటా


ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నన్ను ఓ తండ్రిలా ప్రోత్సహించారు అంటున్నారు దర్శకులు పరుచూరి మురళి. ఆయన తాజా చిత్రం 'అధినాయకుడు'టైటిల్ ప్రకటన సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ..కథ వినగానే బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారు.ఈ సినిమాలోని మూడు క్యారెక్టర్స్‌ని ఎంతో కష్టపడి డీల్ చేశాం. బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మాణానికి సహాయం అందించారు అన్నారు. బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయకుడు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో జరుగుతోంది.

పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కళ్యాణిమాలిక్. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..ఇందులో బాలకృష్ణ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. పెద్దాయన గెటప్‌లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్నారు. పెద్దాయన క్యారెక్టర్‌పై చిత్రీకరించిన పాట హైలెట్‌గా ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయి. త్వరలో ఆడియోను, మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

No comments:

Post a Comment