Friday, February 10, 2012

samantha-about-her-character-auto-nagar-surya


‘ఆటోనగర్ సూర్య’లో సమంత పాత్రేంటి?

దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఆమె ఈ చిత్రంలో తన పాత్ర గురించి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆమె మాట్లాడుతూ...‘ఆటోనగర్ సూర్య’లో పక్కా మాస్ కేరక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా గెటప్, డైలాగ్ డెలివరీ చాలా భిన్నంగా ఉంటాయి. డాన్సులు కూడా ఇందులో ఓ రేంజ్‌లో ఉంటాయి. చూడ్డానికి క్లాస్‌గా కనిపించే నేను ఆ సినిమాలో మాస్ లుక్‌తో ఆకట్టుకుంటా అంది. అలాగే క్లాస్ ఇమేజ్‌లో కొట్టుకుపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు మాస్‌గాళ్ ఇమేజే ఇష్టం. మాస్‌గా కనిపిస్తే ఆ కిక్కే వేరు. నేను నటించే సినిమాల్లో బీభత్సమైన డాన్సులు ఉండాలని కోరుకుంటాను. అప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది అని చెప్పుకొచ్చింది.

మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ చిత్రం వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

No comments:

Post a Comment