Friday, February 10, 2012

prabhas-as-viswamitra-first-look


'విశ్వామిత్ర'గా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదా?

రాఘవేంద్రరావు నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో విశ్వామిత్ర చిత్రం రూపొందనుందంటూ గత కొంత కాలంగా వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ లోనూ,నెట్ లోనూ ఆ చిత్రం ఫస్ట్ లుక్ అంటూ ప్రభాస్ విశ్వామిత్రుడు గెటప్ లో ఉన్న ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఫోటో షాప్ లో చేసినట్లున్న ఈ చిత్రం ఫ్రభాస్ అభిమానులను అలరిస్తోంది.

ఇక ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో గతంలో ఛత్రపతి హిట్టు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అంతకు మించిన హిట్టు అయ్యే సబ్జెక్టు కావాలని,అలాగే మగధీర కు మించిన గ్రాఫిక్స్ తో ముందుకు రావాలని రాజమౌళి అనుకుంటున్నారుట. ప్రభాస్ ప్రస్తుతం రెబెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి మాత్రం తన ఈగకు తుది మెరుగులు దిద్దుతున్నారు. నాని,సమంత కాంబినేషన్ లో రూపొందే ఆ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

No comments:

Post a Comment