Wednesday, February 8, 2012

Mahesh-hires-brad-pitt as personal-trainer

బ్రాడ్ పిట్ పర్శనల్ ట్రైనర్ తో మహేష్ 
మహేష్ బాబు తాజాగా కమిటైన సుకుమార్ చిత్రం కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ షర్ట్ విప్పి బాడీ చూపించే సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. అందుకే హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ కు చెందిన పర్శనల్ ఫిజికల ట్రైనర్ ని రప్పించాడని చెప్పుకుంటున్నారు. ఆ ట్రైనర్ పేరు రోచి. అతను నాలుగు నెలలు పాటు హైదరాబాద్ లో ఉంటారు. అందుకోసం అతని రెమ్యునేషన్ కోటి రూపాయలు. ఇక ఈ చిత్రంలో మహేష్ కాలేజి లెక్చరర్ గా కనిపించనున్నారు.

బిజినెస్ మ్యాన్, దూకుడు చిత్రాలతో మార్కెట్ ని అమాంతం పెంచుకున్న మహేష్ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ..యాడ్ షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ నుంచి రాగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటారు. అనంతరం సుకుమార్ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. సుకుమార్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేయనుంది.

No comments:

Post a Comment