పవన్ సినిమాకు స్క్రిప్టు కంప్లీట్ చేసిన పూరి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ సినిమా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ట్విట్టర్ ద్వారా ఈ చిత్రానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తయింది. పూరి తన సినిమాలకు స్క్రిప్టు రాయడానికి బ్యాంకాక్ లో గడుపుతుంటాడు. ఈ చిత్రానికి కూడా అదే తరహాలో పని కానిచ్చేడు. ఇందుకు సంబంధించిన విషయాలను బి.వి.ఎస్ రవి వెల్లడిస్తూ.....‘‘కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు ఇటీవలే పూర్తయింది. పూరి జగన్నాథ్ తన కెరీర్లో సెన్సేషన్ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. పవర్ స్టార్ సినీ జీవితంలో కూడా ఇదో పెద్ద హిట్ గా నిలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య యూనివర్శల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. అనంతరం మే నెల నంచి పవన్-పూరి సినిమా సెట్స్ పైకి రానుంది.

No comments:
Post a Comment