రామ్ చరణ్ 'రచ్చ' టైటిల్ లోగో విడుదల
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 'రచ్చ' చిత్రం టైటిల్ లోగో ని నిర్మాతలు విడుదల చేసారు. ఈ లోగోకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సూపర్‌గుడ్ మూవీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్. వి. ప్రసాద్, పరాస్ జైన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో ఫిబ్రవరి 26న కర్నూలు పట్టణంలో విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరమ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ లో...బాలీవుడ్ లో 'రాస్కెల్స్', 'ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు.
No comments:
Post a Comment