రచ్చకెక్కాక వెనుతిరిగి చూసుకోను:రామ్ చరణ్
ప్రేమైనా, పోరాటమైనా...ఒక్కసారి రచ్చకెక్కాక మాత్రం ఇక వెనుదిరిగి చూసుకోనని చెప్పే ఆ కుర్రాడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం 'రచ్చ'చూడాల్సిందే అంటున్నారు రామ్‌చరణ్. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న చిత్రం 'రచ్చ'. సంపత్ నంది దర్సకత్వంలో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఢిఫరెంట్ గా ఉంటుందంటున్నారు. ఈ చిత్రం పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా మీడియా తో రామ్ చరణ్ ఇలా స్పందించారు. అలాగే నిర్మాతలు ఈ చిత్రం గురించి చెపుతూ..''నేటితరం భావాల్ని అణువణువునా నింపుకొన్న ఓ యువకుడి కథ ఇది. దేనికీ తలొగ్గని అతను జీవితంలో సాధించిందేమిటో తెరపైనే చూడాలి. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో చిత్రం సాగుతుంది. 'గ్యాంగ్‌లీడర్'లోని 'వానా వానా వెల్లువాయె...' రీమిక్స్ పాటకి రామ్‌చరణ్ వేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, సమర్పణ: ఆర్.బి.చౌదరి. ఎన్వీప్రసాద్, పారాస్‌జైన్ నిర్మాతలు.
No comments:
Post a Comment