'ఆటోనగర్ సూర్య'కథ ఆ అంశాలు చుట్టూనే
వెన్నెల,ప్రస్దానం చిత్రాల దర్శకుడు దేవకట్టా తాజా చిత్రం 'ఆటోనగర్ సూర్య'. సూపర్ హిట్ చిత్రం 'ఏమాయ చేశావె'కాంబినేషన్ నాగచైతన్య-సమంత ని రిపీట్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సమాచారం తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. ఆటోనగర్ అడ్డాగా మార్చుకొన్న సూర్య ఏం చేశాడు? అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. దేవాకట్టా కథను చెప్పే విధానం తప్పకుండా ఆకట్టుకొంటుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగం కూడా త్వరితగతిన తెరకెక్కిస్తాము.ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం ''అన్నారు. ఇక ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఆమె ఈ చిత్రంలో తన పాత్ర గురించి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆమె మాట్లాడుతూ...‘ఆటోనగర్ సూర్య’లో పక్కా మాస్ కేరక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా గెటప్, డైలాగ్ డెలివరీ చాలా భిన్నంగా ఉంటాయి. డాన్సులు కూడా ఇందులో ఓ రేంజ్‌లో ఉంటాయి. చూడ్డానికి క్లాస్‌గా కనిపించే నేను ఆ సినిమాలో మాస్ లుక్‌తో ఆకట్టుకుంటా అంది. అలాగే క్లాస్ ఇమేజ్‌లో కొట్టుకుపోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు మాస్‌గాళ్ ఇమేజే ఇష్టం. మాస్‌గా కనిపిస్తే ఆ కిక్కే వేరు. నేను నటించే సినిమాల్లో బీభత్సమైన డాన్సులు ఉండాలని కోరుకుంటాను. అప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా. సంగీతం: అనూప్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.
No comments:
Post a Comment