Tuesday, February 7, 2012

Ram-new-film-titled-ongole-gitta

'ఒంగోలు గిత్త' టైటిల్ తో కుర్ర హీరో
 రామ్ త్వరలో 'ఒంగోలు గిత్త'గా కనిపించనున్నారు. ఎవరితోనైనా కయ్యానికి సై అంటూ ఉత్సాహంతో ముందుకి ఊరికే వాళ్లను ఒంగోలు గిత్తతో పోలుస్తుంటారు. హీరో క్యారెక్టరైజేషన్‌ కూడా ఇలానే ఉంటుందన్నది సమాచారం. ఈ చిత్రంతో మరో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్‌ కూడా ఇప్పటికే రెడీ అయిందని వినికిడి. ప్రస్తుతం రామ్ 'కందిరీగ' సినిమా సక్సెస్‌తో హీరో రామ్‌ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ప్రేమకథలను తనదైన శైలిలో తీస్తాడని పేరున్న దర్శకుడు కరుణాకరన్‌తో తదుపరి చిత్రం చేస్తున్నాడు.

'ఎందుకంటే...ప్రేమంట' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో దీనిని నిర్మిస్తున్నారు. మరో ప్రక్క రామ్‌ నటించే 'ఒంగోలు గిత్త'సినిమాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలతో ప్రకటన రానుంది.

No comments:

Post a Comment