Monday, February 6, 2012

samantha-s-mani-ratnam-s-kadali

సమంతపై రూమర్ నిజమైంది
ఆ మధ్యన మణిరత్నం దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా చెయ్యనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్ అని సమంత ఒక దశలో కొట్టిపారేసింది. అయితే అదే రూమర్ ఇప్పుడు నిజమైంది.మణిరత్నం దర్సకత్వంలో ఆమె చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. ‘కడల్’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించనున్నట్లు మణిరత్నం మీడియా ముందు ప్రకటించటంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. తమిళనటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది. ‘కడలి’ టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఈ విషయమై సమంత స్పందిస్తూ..‘‘మణి సార్ డెరైక్షన్‌లో నటించాలనేది నా కల మాత్రమే కాదు. ఇండియాలోని ప్రతి ఆర్టిస్ట్ కల. ఆ శుభ ఘడియ నాకు ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. దీన్ని గాడ్ గిప్ట్ గా భావిస్తున్నాను. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినా కలగని ఆనందం మణి సార్ సినిమాలో చేస్తున్నందుకు కలిగింది’’అంది.

No comments:

Post a Comment