'రచ్చ'షూటింగ్ ఆపేసి పంపించేసారు
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ షూటింగ్ కేరళలో అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం పాట షూటింగ్ నిమిత్తం పెరియార్ టైగర్ రిజర్వ్ పార్క్ లోని లేక్ కి వెళ్లారు. అక్కడ రామ్ చరణ్,తమన్నా రెడీ అవ్వగానే...అక్కడ ఫారెస్ట్ డిప్యూటీ డైరక్టర్ సంజయ్ కుమార్ అడ్డం చెప్పారు. అక్కడ లైఫ్ జాకెట్స్ లేనిదే ఆ లేక్ లో ప్రవేసించటానికి వీళ్ళేదన్నారు. అయితే అవి వేసుకుంటే రొమాంటిక్ మూడ్ పోతుందని దర్శకుడు సంపత్ నంది కుదరదని చెప్పాడు. అయితే అక్కడ షూటింగ్ కూడా కుదరదని ఆయన నిక్కచ్చిగా చెప్పేసాడు. దాంతో ఎంత కన్వీన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. వేరే దారి లేక షూటింగ్ ఆపు చేసేసి వెనక్కి వచ్చేసారు. ఇక రచ్చ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ నెట్ లో లీక్ అయ్యి హైప్ క్రియేట్ అయ్యింది. ఆరెంజ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు. సంపత్ నంది కిది రెండో చిత్రం. మొదటి చిత్రం వరుణ్ సందేశ్ తో చేసిన ఏమైంది ఈ వేళ యావరేజ్ అయ్యింది.

No comments:
Post a Comment