Wednesday, February 8, 2012

sameera-addicted to angry-birds

రామ్ చరణ్ తో పాటు సమీరా రెడ్డి కూడా ఎడిక్ట్
రామ్ చరణ్ ఆ మధ్యన ట్వీట్ చేస్తూ..తాను తన ఫోన్ లో ఉన్న యాంగ్రీ బర్డ్స్ గేమ్ కు ఎడిక్ట్ అయ్యాయని,తనకు ఎప్పుడు టైమ్ దొరికితే అప్పుడు అ ఆట ఆడుతున్నాను అన్నాడు. ఇప్పుడు సమీరా రెడ్డి కూడా అవే మాటలు వల్లిస్తోంది. ఆమె మాట్లాడుతూ..తాను ఫోన్ లో ఏంగ్రీ బర్డ్స్ గేమ్ కు ఎడిక్ట్ అయ్యానని,అస్సలు దాన్ని ఆడకుండా ఉండలేనని అంది. ప్రస్తుతం సమీరా రెడ్డి..ఇప్పటి వరకు స్కిన్ షో చేసిన సినిమాలేవీ నాకు పేరు తీసుకు రాలేదు.

ఇక పై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాని అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇక గతంలో నేను తమిళంలో చేసిన ‘వారనమ్ అయిరమ్’(సూర్య సన్నాఫ్ కృష్ణన్) నాకు మంచి పేరు తీసుకువచ్చింది. అలాంటి పాత్రలు చేయటం కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇకపై అలాంటి పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. అలాగని ఒకే టైపు పాత్రలు చేయాలన్న బోర్ కొడుతుంది. సినిమా సినిమాకి కొత్తదనం ఉండాలి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇటీవలే తమిళ్లో నటించిన ‘వెట్టై’ చిత్రం పెద్ద హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులోనూ రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment