Wednesday, February 8, 2012

Ramcharan-tamanna-as-dance-students

రామ్ చరణ్ 'రచ్చ'ఫ్లాష్ ఎపిసోడ్ లో... 
రచ్చలో రామ్ చరణ్, తమన్నా ప్రేమలో పడే ఎపిసోడ్స్ గమ్మత్తుగా ఉంటాయని తెలుస్తోంది. వీరిద్దరు తొలిసారి కలిసినప్పుడు గతంలో వారి పరిచయం గుర్తుకు వస్తుందని తెలుస్తోంది. వాళ్ళిద్దరూ కలవగానే గత జ్ఠాపకాలతో కూడిన ఓ ప్లాష్ బ్యాక్ రివీల్ అవుతుందని చెప్తున్నారు. ఆ ప్లాష్ బ్యాక్ వాళ్లిద్దరూ డాన్స్ స్కూల్ ఎకాడమిలో డాన్స్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు తో ప్రారంభం అవుతుందిట. ఆ ఎపిసోడ్ లో వచ్చే పాట హైలెట్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ అక్కడే ప్రేమలో పడతారని, వారి ప్రేమకు ఆ అకాడమి వేదిక అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మెడికోగా కనిపించనున్నారు.

మాస్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా నడిచే ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ లోని ఓ పాటను సైతం రీమిక్స్ చేసారు. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ పేరు విశ్వం. ఇక ఈ ఆడియోని పిబ్రవరి 20న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment