Sunday, February 12, 2012

surender-reddy-new-film-with-allu-arjun


స్టార్ డైరక్టర్ సురేంద్రరెడ్డి కొత్త చిత్రం ఖరారు

'అతనొక్కడే', 'కిక్‌' వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు సురేంద్ర రెడ్డి. ఆయన తన తాజా చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయటానికి రంగం సిద్దమైంది. అల్లు అర్జున్ కూడా కథని విని ఈ సినిమాని ఓకే చేసినట్లు సమాచారం. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. కథ, హీరో పాత్ర చిత్రణ బన్నీకి నచ్చాయని తెలిసింది. ఏప్రిల్‌ నుంచి ఈ చిత్రం మొదలవుతుంది.ఈ కొత్త చిత్రంలో 'కిక్‌'తరహా వినోదాన్నీ, 'అతనొక్కడే' తరహా యాక్షన్‌ అంశాల్నీ పండించినున్నట్లు చెప్తున్నారు దర్శకుడు సురేందర్‌ రెడ్డి.

ఇక ఎన్టీఆర్ తో చేసిన 'వూసరవెల్లి'తర్వాత సురేంద్ర రెడ్డి చేస్తున్న చిత్రం ఇదే. నల్లమలపు బుజ్జి కూడా గోపీచంద్ తో చేసిన మొగుడు డిజాస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మరో ప్రక్క అల్లు అర్జున్..త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం నటిస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రం డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment